‘మద్యం సేవించి వాహన పగ్గాలు పట్టకండీ’, ‘మద్యం సేవించి వాహనాలు నడుపరాదు’ .. అంటూ ఇటు రాష్ట్ర రహధారులతో పాటు అటు జాతీయ రహదారులపై కూడా కనిపిస్తుంటాయి. ఇప్పటికే పంజాగుట్ట వద్ద జరిగిన దారుణ ఘటనలో చిన్నారి సహా ఆ కుటుంబానికి చెందిన పలువురు వ్యక్తులు మద్యం బాబుల నిర్లక్ష్యానికి బలయ్యారు.. ఉప్పల్ వద్ద కూడా ఇలాంటి ఘటనలోనే రోడ్డదాటుతున్న క్రమంలో మధ్యం బాబుల కారు ఢీకోనడంతో ఓ పాప తన చిన్నారి చెల్లిని, తల్లిని కోల్పోయింది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే స్పందించి.. ఆ తరువాత వాటిని మర్చిపోయి.. మద్యం సేవించి వాహనాలను నడిపే వారి సంఖ్య లెక్కపెట్టలేనిదే.
ఘటనలు జరిగినప్పుడు స్పందించే హృదయం మాత్రమే వుండటం కాదు.. అసలు అలాంటి ఘటనలకు తావు ఇవ్వకుండా వుంటేనే మంచిదన్న భావన కల్పించాలని పోలీసులు నిత్యం కృషి చేస్తున్నారు. ఇక కొత్త సంవత్సరం వేడుకల సందర్భంలో హైదరాబాదులో పట్టుబడిన మందుబాబుల సంఖ్యల 2,499. ఫుల్లుగా మందుకోట్టి వాహనాలపై తిరిగే వారి సంఖ్య ఇది. ఇంతలా మందుబాబులు పట్టుబడిన నేపథ్యంలో పోలీసులు కల్పించిన డ్రంకె అండ్ డ్రైవ్ అవగాహన తరగతులు ఫలితాలను ఇచ్చాయా..? అన్న అంశం కూడా చర్చనీయాంశమైంది. కాగా, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఇటీవల ఓ వీడియో సందేశాన్ని ఇచ్చిన టీవీ యాంకర్ ప్రదీప్.. పోలీసులకు చిక్కడం కూడా వైరల్ గా మారింది.
బుల్లితెరపై తనకంటూ మంచి పాపులారిటీని సంపాదించుకుని మరోరకంగా సెలబ్రిటీ స్టేటస్ కూడా పోందుతున్న టీవీ యాంకర్ ప్రదీప్.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వద్ద నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోవడంతో ఇవాళ తన కుటుంబసభ్యులతో పాటు బేగంపేట ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ కు చేరుకున్నాడు. అయితే బ్రీత్ ఎనలైజర్ పరీక్షలలో బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్ (బీఏసీ) 178గా నమోదు కావడంతో ప్రదీప్ కు వారం రోజుల కారాగారవాసం తప్పదన్న వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి.
కాగా, యాంకర్ ప్రదీప్ మరో కేసులో కూడా చిక్కకున్నాడు. నిజానికి సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్న ప్రదీప్.. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాలను అతిక్రమించాడు. తన కారుకు బ్లాక్ ఫిల్మ్ స్టిక్కర్లను వేసుకున్నాడు. అది కూడా చట్టవిరద్దమని భావించిన ట్రాఫిక్ పోలీసులు అయనపై మరో కేసును కూడా నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. కాగా ఇదివరకు సిటీలో ఇలా బ్లాక్ స్టికర్లు వేసుకుని తిరిగి సెలబ్రిటీలకు స్టిక్కర్ ను తీయించి వెయ్యి రూపాయల జరిమానా విధించారని.. దీంతో అదే తరహా నేరం కాబట్టి జరిమానా విధించే అవకాశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more