tirumala srivari lucky dip tickets time reduced తిరుమలేశ గోవిందా.. లక్కీడిప్ టిక్కెట్ సమయం గోవిందా..!

Tirumala srivari lucky dip tickets time reduced

tirumala tirupathi devasthanam, lucky dip tickets, boking time reduced, lucky dip allocations time, tirumala e-seva, andhra prradesh news, India News, Latest News

tirumal tirupati devasthanam comittee reduced the lucky dip time from week to four days.

తిరుమలేశ గోవిందా.. లక్కీడిప్ టిక్కెట్ సమయం గోవిందా..!

Posted: 01/05/2018 12:45 PM IST
Tirumala srivari lucky dip tickets time reduced

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని భక్తులకు ఇది చేదువార్త. స్వామివారికి నిత్య, వార సేవల్లో భాగంగా నిర్వహించే సేవా టికెట్లలను బుక్ చేసుకునే సమయంలో కోత విధంచేశారు. దీంతో భక్తులు ఎన్నో పర్యాయాలు బుక్ చేసుకున్నా తమను అదృష్టం విరంచలేదని, బాధపడే భక్తులు.. ఇక సమయంలోనూ కొత విధించడంతో ఇకనైనా తమకు అదృష్టం కలిసివస్తుందా..? అన్న కొందరు వేచిచూస్తుండగా, వారం రోజులు వున్నప్పుడే రాలేదు. ఇక ఇప్పుడు వచ్చేనా అని అందోళన చెందుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. తిరుమల శ్రీవారికి సుప్రబాతం, తోమాల సేవ, అష్టపద పాదపద్మార్చన, సహా మరికోన్ని సేవలకు భక్తులను లక్కీ డిప్ బుకింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. అయితే ఈ సేవలకు ఇప్పటివరకు వున్న వారం రోజుల సమయాన్ని తగ్గించి దానిని నాలుగు రోజులకే పరిమితం చేశారు టీటీడీ అధికారులు. అయితే ఇందుకు గల వివరాలను మాత్రం వెల్లడించకుండానే.. ఏప్రిల్ మాసానికి సంబంధించిన టికెట్లను ఇవాళ అన్ లైన్ లో భక్తుల కోసం అందుబాటులో పెట్టేశారు. అయితే లక్కి డిప్ సంబంధించిన టికెట్ల సమయాన్ని నాలుగు రోజులకు మాత్రమే పరిమితం చేసినట్లు టీటీడీ ప్రకటించింది.

ప్రస్తుతం ప్రతి నెలా మొదటి శుక్రవారం సేవా టికెట్లతో పాటు మూలవిరాట్ వద్ద భక్తులను కూర్చోబెట్టి చేసే ముఖ్యమైన దిన, వార సేవలకు సంబంధించిన టికెట్లను లక్కీ డిప్ ద్వారా భక్తులకు అందిస్తున్న విషయం తెలిసిందే. లక్కీ డిప్ లో పేర్లను నమోదు చేసుకునేందుకు వారం రోజులుగా వున్న గడువును కుదించేశారు. నెలలో మొదటి శుక్రవారం నుంచి రెండో శుక్రవారం వరకు అందుబాటులో వుండే టికెట్లు ఇక రెండో శుక్రవారం ఉదయం 11 గంటలకు లక్కీ డిప్ తీసి ప్రకటిస్తారు. అయితే ఈ సారి నుంచి ఈ వారం రోజుల సమయం తగ్గించి వాటిని నాలుగు రోజులకు తగ్గించారు.

ఏప్రిల్ నెలకు సంబంధించిన 56,593 టికెట్లను నేటి నుంచి అందుబాటులో ఉంచామని తెలిపిన ఆయన, వీటిల్లో 10,658 టికెట్లను లక్కీ డిప్ లో అందుబాటులో వుంచారు. సుప్రభాతం 7,878, తోమాల సేవ 120, అర్చన 120, అష్టదళపాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2,300 టికెట్లను డిప్ ద్వారా అందించనున్నారు. ఇవి కావాలంటే, సోమవారంలోగా పేర్లను నమోదు చేసుకోవాలి. వీటితో పాటు విశేష పూజ 1,875, కల్యాణోత్సవం 11,250, ఊంజల్‌ సేవ 3,000, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,805, వసంతోత్సవం 11,180, సహస్ర దీపాలంకరణ 12,825 టిక్కెట్లును విడుదల చేశారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles