దేశపౌరులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు అక్రమమార్గంలో లీక్ అవుతున్నాయని, దీంతో దేశ పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అందోళన వ్యక్తం చేస్తూ కథనాన్ని రచించిన జర్నలిస్టుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని విజిల్ బ్లోయర్, అవినీతి వ్యతిరేక కార్యకర్త ఎడ్వర్డ్ స్నోడన్ అవేదన వ్యక్తం చేశాడు. దేశపౌరుల సమాచారం పక్కదారి పడుతున్న విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన అభినందించి అవార్డును అందజేయాల్సిన ప్రభుత్వం.. ఈ కథను వెలుగులోకి తీసుకువచ్చినందుకు పోలీసు కేసును బహుమతిగా ఇవ్వడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు.
భారతదేశ ప్రజల ఆధార్ వివరాలు హ్యాక్‌కి గురయ్యాయని ద ట్రిబ్యున్ పత్రికలో కథనం ప్రచురించిన జర్నలిస్ట్ రచనా ఖైరా మీద ఆధార్ సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ స్పందించారు. సమస్యను పరిష్కరించడం మానేసి, సమస్యను గుర్తించిన వారిని నియంత్రించాలనుకోవడం సబబు కాదని స్నోడెన్ పేర్కొన్నారు. అధికార దుర్వినియోగాన్ని బయటిపెట్టినందుకు సదరు జర్నలిస్టుకి అవార్డు ఇవ్వాల్సింది పోయి ఇలా విచారణకు ఆదేశించడమేంటని స్నోడెన్ ఓ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.
ప్రభుత్వానికి నిజంగా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఉంటే ఇలాంటి చర్యలు తీసుకోదని ఆయన వ్యాఖ్యానించారు. బిలియన్ల మంది భారతీయుల వ్యక్తిగత వివరాలను నమోదు చేసే పాలసీలను మార్పు చేయడమో లేక దుర్వినియోగానికి పాల్పడి తప్పు చేసిన వారిని శిక్షించడమో చేయాలని స్నోడెన్ సూచించారు. మరోవైపు హ్యాక్‌కి సంబంధించి వార్తలు వచ్చినపుడు కూడా స్నోడెన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినప్పటికీ, వ్యక్తిగత వివరాల హ్యాక్‌ని అరికట్టలేరని స్నోడెన్ గత ట్వీట్లో పేర్కొన్నారు.
The journalists exposing the #Aadhaar breach deserve an award, not an investigation. If the government were truly concerned for justice, they would be reforming the policies that destroyed the privacy of a billion Indians. Want to arrest those responsible? They are called @UIDAI. https://t.co/xyewbK2WO2
— Edward Snowden (@Snowden) January 8, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more