ప్రజాప్రతినిదులుగా కోనసాగుతూ ఇటు న్యాయవాద వృత్తిలోనూ రాణిస్తున్న అడ్వకేట్లకు షాక్ తగలనుంది. ఈ నెల 22న వారి భవితవ్యం తేలనుంది. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా లేదా కార్పొరేటర్లుగా ఉంటూ లాయర్ వృత్తిని కొనసాగిస్తున్న రాజకీయ నాయకులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసింది. చట్ట సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని న్యాయవాద వృత్తి చేపట్టకుండా బార్ కౌన్సిల్ ఎందుకు డీబార్ చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. వారం రోజుల్లోగా సమాధానాలను కౌన్సిల్‌కు గడువు ఇచ్చింది.
ఈ విషయంపై నియమితమైన ముగ్గురు నిపుణుల కమిటీ.. దేశవ్యాప్తంగా 500 మందిపైగా ‘పొలిటీషియన్’ లాయర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఒకవేళ రాజకీయ నాయకులకు లాయర్లుగా కొనసాగే అర్హత లేదనే నిర్ణయం వెలువడితే, వారందరూ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలకు దిగకుండా ఉండేందుకు ముందస్తుగా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) లీడర్, లాయర్ అశ్విని ఉపాధ్యాయ పొలిటీషియన్ లాయర్లను డిబార్ చేయాలంటూ గతంలో భారతీయ ప్రధాన న్యాయమూర్తి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్లకు లేఖ రాశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లేఖలో ఉదహరించిన అశ్విని.. ప్రభుత్వం నుంచి వేతనం అందుకుంటున్న ఓ వ్యక్తి లేదా సంస్థ లేదా కార్పొరేషన్ ఓ కోర్టులో న్యాయవాదిగా వాదించలేదని పేర్కొన్నారు. కాగా, రాజకీయ నాయకులు న్యాయవాద వృత్తి ని కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై బార్ కౌన్సిల్ ఈ నెల 22న తుది విచారణ జరపనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more