Raghunandan Yandamuri to be executed on Feb. 23 శాన్వి కేసులో దోషికి అగ్రరాజ్యంలో మరణశిక్ష

Killing a baby and her grandma in us date set for execution of andhra techie

Execution put off for PIO prisoner in US, Raghunandan Yandamuri 's execution deferred, Raghunandan Yandamuri, yandamuri, tom wolf yandamuri, tom wolf, pennsylvania department of corrections, death penalty for andhra techie in US

Raghunandan, a native of Andhra Pradesh, killed 10-month-old Saanvi Venna and her grandmother Satyavathi Venna in a botched ransom kidnapping.

శాన్వి కేసులో దోషికి అగ్రరాజ్యంలో మరణశిక్ష

Posted: 01/12/2018 06:57 PM IST
Killing a baby and her grandma in us date set for execution of andhra techie

అగ్రరాజ్యానికి వెళ్లినా.. చెడు వ్యసనాలు అలవాడు పడి.. అత్యంత దారుణంగా పది నెలల చిన్నారి శాన్వి, ఆమె అమ్మమ్మ సత్యవతిని హత్య చేసిన యండమూరి రఘునందన్ అమెరికా న్యాయస్థానం మరణశిక్షను విధించింది. ఫిబ్రవరి 23న మరణశిక్ష అమలు చేయనున్నాట్లు న్యాయస్థానం వెలువరించింది. 2012లో రఘు ఈ ఘాతుకానికి పాల్పడగా 2014లో దోషిగా తేల్చిన అమెరికా కోర్టు మరణశిక్ష విధించింది.

2015 నుంచి పెన్సిల్వేనియాలో మరణశిక్ష అమలుపై నిషేధం ఉంది. రెండు దశాబ్దాలుగా ఇక్కడ మరణ శిక్ష అమలు కాలేదు. గవర్నర్ ఈ నిషేధాన్ని తాత్కాలికంగా సడలించడమో, ఎత్తివేయడమో ఏదో ఒకటి చేస్తే తప్ప రఘుకు మరణశిక్ష అమలు చేయడం సాధ్యం కాదు. ఈ రెండూ జరగకుంటే మరణశిక్ష వాయిదా పడే అవకాశం ఉంది. ఒకవేళ శిక్ష అమలైతే అమెరికాలో మరణశిక్షకు గురైన తొలి ఇండో-అమెరికన్‌గా రఘు చరిత్రకు ఎక్కుతాడు.
 
విశాఖపట్టణానికి చెందిన రఘునందన్ పెన్సిల్వేనియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేశాడు. గుంటూరుకు చెందిన శాన్వి తల్లిదండ్రులు వెన్నా వెంకట్, చెంచులత ఉండే అపార్ట్‌మెంట్‌లోనే రఘు కూడా నివసించేవాడు. వారితో సన్నిహితంగా మెలిగేవాడు. జూదానికి బానిసై పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న రఘు అప్పులపాలయ్యాడు. వాటని భర్తీ చేసుకునేందుకు శాన్విని కిడ్నాప్ చేసేందుకు పథకం రచించాడు.

2012లో శాన్విని కిడ్నాప్ చేశాడు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన ఆమె అమ్మమ్మ సత్యవతిని దారుణంగా హత్య చేశాడు. 50 వేల డాలర్లు ఇవ్వకుంటే పాపను చంపేస్తానంటూ లేఖ వదిలి వెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాపను కిడ్నాప్ చేసింది రఘునే అని నిర్ధారించిన అధికారులు అతని గదిలో తనిఖీలు చేయగా, ఓ సూట్‌కేసులో శాన్వి మృతదేహం బయటపడటంతో అతనినే దోషిగా నిర్ధారించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : death penalty  andhra techie  kidnapping  yandamuri raghunandan  US  America  

Other Articles