గురువింద గింజ లాంటి వాళ్లు సమాజంలో పరపతి కోసం వెంపర్లాడటం సహజం. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఇలాంటి గురవిందలు ఏకంగా అకాశంపైనే ఉమ్మి వేయాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అకాశంపై ఉమ్మివేస్తే ఏం జరుగుతుందో బాగా అనుభవం గడించిన వీళ్లు కొంత ధోరణి మార్చి అకాశంపై కాకుండా.. అంతెత్తుకు ఎదిగిన ప్రముఖులను టార్గెట్ చేసి వారితో ఢీ కొని తమ ఇమేజ్ ను పెంచుకునేందుకు వెంపర్లాడుతున్నారు.
ఇలాంటి వాళ్ల కోవకు చెందిన వ్యక్తే.. తనకు తానుగా సీని విమర్శకుడిననని ప్రకటించుకున్న కత్తి మహేష్ కూడా అని పవన్ అభిమానులు విమర్శిస్తున్నారు. సినీ విమర్శకులు సినిమాలను విమర్శించాలి అంతేకాని.. సినిమా నటీనటులను, దర్శక నిర్మాతలను, టెక్నికల్ నిపుణులను కాదు. వారి వ్యక్తిగత జీవితాలను అంతకన్నా కాదు. వారు చేసే ప్రజాహిత కార్యక్రమాలను అసలే కాదు. వారి చేసే రాజకీయ పనులను మూమ్మాటికీ కాదని కూడా అభిమానులు నొక్కివోక్కానిస్తున్నారు.
సినిమా గురించి విమర్శించినంత మాత్రాన సినీ విమర్శకులు ఎవరికీ విరోధులు కాదు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినవాళ్లు మాత్రమే అవుతారు. ఒక హీరో నటించిన ఓ సినిమా హిట్ కాకపోవడానికి కారణాలను విశ్లేషించి.. అదే హీరో నటించిన మరో సినిమా హిట్ కొట్టిన తరుణంలో ఆ చిత్రంలో వున్న ప్లస్ పాయింట్లను కూడా వివరించడం వల్ల అభిమానులు ఒకింత అగ్రహానికి గురైనా మరోమారు మంచి రిమార్కులు ఇవ్వగానే అకాశానికి కూడా ఎత్తేస్తారు. అలా కాకుండా అసలు ఆ హీరో నటించే చిత్రాలన్ని బాగోలేవని.. సినిమాలను అడ్డుపెట్టుకుని ఏకంగా నటుడినే టార్గెట్ చేస్తే.. దీనిని ఎవరూ హర్షించరు.
పవన్ కల్యాన్ ఫ్యాన్స్ తో కత్తి మహేష్ కు ఏం పని..? సినిమా రివ్యూ విఫయంలో అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తే.. అది అంతవరకే పరిమితం ఛేయాలి తప్ప.. దానిని సాగదీసి.. మీడియాలోకి ఎక్కి హైలైట్ చేస్తే.. కొన్నాళ్లు ప్రచారం బాగానే వుంటుంది. కానీ ఆ తరువాత కూడా ఇదే ప్రచారాని కొనసాగిస్తే రోత పుడుతుంది. సినీ విశ్లేషకుడిగా, విమర్శకుడిగా అనుభవం సంపాదించిన కత్తి మహేష్ అన్ని ఊహాజనితమైన ప్రశ్నలు తనను తానే సంధించుకుని అవి వాస్తవ రూపం దాల్చినట్టుగా భ్రమించి మరీ మీడియా ముందుకు రావడం కూడా సహేతుకం కాదు.
సినిమా విమర్శకులైనంత మాత్రం నటుడు కాదు.. నటన ఒక కళ.. ఒక సినిమాను రూపోందించేందుకు అటు నటనతో పాటు ఇటు దర్శకత్వం ప్రతిభ, మరోవైపు కథ, ఇంకోవైపు సంగీతం ఇలా అనేక కళల సమ్మేళనంతోనే ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం రంగంపై లైట్ బాయ్ నుంచి నిర్మాత వరకు వేలాది మంది ఓ చిత్రం కోసం పాటుపడుతుంటారు. తమ శ్రమ ఎలా వుందన్నది తమ స్నేహితులతో కలసి చిత్రాన్ని చూసి అస్వాధించినప్పుడు వారిలో కలిగే సంతోషమే వారికి మరో చిత్రానికి పనిచేసే బలాన్ని ఇస్తుంది. ఇలా చిత్రాలు తీసుకువచ్చే పేరు ప్రఖ్యాతులే చిరస్థాయిగా నిలుస్తాయి.
ఇవన్నీ తెలియకుండా.. తన సినిమాను ప్రేక్షకులు అదరించలేదని, అందుకనే కక్షగట్టినట్టుగా రివ్యూలు రాసి.. విమర్శలు చేస్తే.. వేలాదిమందిలో ఎందరి మనస్సులు నోచ్చుకుంటాయోనన్న విషయం కూడా అర్థం చేసుకోవాలి. సినీ విమర్శకులంటే ఐఎస్ఐ బ్రాండ్ కాదు. సినిమాలపై ఏ మాత్రం అవగాహనలేని వాళ్లు కూడా విమర్శకులుగా మారిపోవచ్చు. కానీ నటులుగా, సంగీత దర్శకులుగా, దర్శకులుగా, కెమెరామెన్, అర్ట్ డైరెక్టర్, స్టంట్ మాస్టార్ ఇలా ఏదేని కావాలన్నా దానికి ఎంతో ప్రతిభ కావాల్సిందే. ఇలా నోచ్చుకున్న వాళ్లు కత్తిపై కత్తగట్టరని ఏంటీ గ్యారంటీ..?
ఫవన్ ఫ్యాన్ కలసి వస్తామంటున్నారు.. మరి సిద్దమా.?
తాజాగా తన వాహనపై పవన్ కల్యాన్ అభిమానులు కొడిగుడ్లతో దాడి చేశారని అరోపిస్తున్న కత్తి మహేష్.. వారిని గుర్తు పట్టగలరా..? వారు పవన్ అబిమానులేనని ఎలా చెప్పగలరు.? కేవలం తాజాగా పవన్ అభిమానుల తనపై అగ్రహంతో వున్నారు కాబట్టి వాళ్లే ఇలా చేశారని రగలిపోతూ అరోపణలు చేయడం తప్ప.? నిజాలను గ్రహించలేకపోతున్నారు. ఏమీ చేయకుండానే పవన్ ఫ్యాన్స్ అంత చేసేశారు. ఇంత చేశారారు. అంటూ ఏకంగా టీవీ లైవ్ డిబేట్లలోకి వెళ్ల మరీ అరోపణలు చేస్తున్న కత్తిపై కొడిగుడ్ల దాడి చేస్తారా.. అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.
ఈ క్రమంలో కొడిగుడ్ల దాడి చేసిన వారెవరైనా వాళ్లని మీరూ వదలకండీ, మేము వదలబోమని పవన్ అభిమానులు తేల్చిచెబుతున్నారంటే ఇది ఎవరో మరో వ్యక్తి ప్రమేయం వుండివుంటుందని కూడా పవన్ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికోందరు మాత్రం మహేష్ కత్తి కావాలనే తనపై తానే కోడిగుడ్డు వేయించుకుని రాంగ్ ప్రాపగాండ చేసి జనంలో సానుభూతి పోందాలని వెంపర్లాడుతున్నాడని కూడా అరోపిస్తున్నారు. ఇక ఈ సినీ విమర్శకుడిపై దాడి చేయడం వల్ల మాకు కలిగే లాభమేంటి అని కూడా పవన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
కత్తి మహేష్ పై దాడి నిజమే అయిన క్రమంలో పవన్ కల్యాన్ అభిమానుల అనుమానాలివే..
1. ప్రధాని మోడీని నరహంతకుడు అని తిట్టినందుకా?
2. హిందూ ధర్మాన్ని కించపరుస్తూ అర్ధ రాత్రి గుడి తలుపులు తెరవాలి అన్నందుకా?
3. చంద్రబాబు నియంతృత్వ ధోరణి అని నోరు పారేసుకున్నందుకా?
4. ఎంతో మందిని కించపరుస్తూ ఎరా, నువ్వా, ని సంగతి నాకు తెలుసు అని బెదిరించినందుకా?
5. అమ్మాయిలను ఫేస్ బుక్ లో వేధించినందుకా?
6. ప్రజా సంకల్పయాత్ర నుంచి టీవీ, మీడియా కవరేజ్ ను అడ్డుకుని.. ఇటు జనం దృష్టిని సైడ్ ట్రాక్ చేస్తున్నందుకా..?
7. గతంలో హీరోయిన్ల కోసం ఆడిషన్స్ నిర్వహించి అందులో కొందరికి మెసేజ్ లు పెట్టి వేధించినందుకా?
8. లేకపోతే ఈ టీవీ చానెల్స్ వల్లే డబ్బులిచ్చి చేయించారా?
9. ఇలా కోడిగుడ్ల దాడి జరగ్గానే.. కత్తి మహేష్ తలపై, టీషర్టుపై పగిలిన కోడిగుడ్డు ఫ్రెష్ గా వుండగానే మీడియా అక్కడికి ఎలా వచ్చింది.?
10. హుటాహుటిన వచ్చిన మీడియా గుడ్డు విసిరిన వాళ్లను కనీసం కవరేజ్ చేయలేదెందుకు..? అన్న ప్రశ్నలు కూడా పవన్ అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
లైవ్ డిబేట్ నుంచి వెళ్లిపోయినప్పుడు ఏం చెప్పావు..? ఎం చేశావు..?
సినీమాలను విమర్శంచే స్థాయితో, బిగ్ బాస్ షోతో పేరుతెచ్చుకన్న కత్తి మహేష్.. తన మాటలకే తాను కట్టబడనని చెప్పకనే చెప్పాశాడని కూడా పవన్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ తెలుగు టీవీ లైవ్ షోలో పాల్గోన్న సందర్భంగా కత్తి మహేష్ ను డైరెక్టర్ వివేక్ మీపై దాడి చేస్తే ముందగా ఏం చేస్తారు.? అని అడగ్గా.. పోలీసులకు పిర్యాదు చేస్తానని అన్నారు. ఎందుకంటే అది వారు చేసిన శారీరికంగా చేసే దాడి కాబట్టి అని.? మరీ అలాంటప్పుడు కోడిగుడ్లతో దాడి జరిగిందని అరోపిస్తున్న కత్తి మహేష్.. ముందుగా పోలీసులను పిర్యాదు చేయకుండా..? టీవీ వాళ్లను పిలవడంతో అంతర్యమేమిటని పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
టీవీ వాళ్లకు ముందుగానే సమాచారాన్ని ఇచ్చి తననకు తానుగా దాడి చేసుకుని.. అది కాస్తా పవన్ అభిమానులే చేశారని ఎందుకు అరోపిస్తున్నారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు మీడియాకు చెప్పారన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి. పోలీసులు వస్తే స్థానికంగా వున్న సిసీటీవీ ఫూటేజీలను పరిశీలించి నిజాలను నిగ్గుతేలుస్తారని.. అలా అయితే తన బండారం మొత్తం బయటపడుతుందనే ఇలాంటి చీఫ్ ట్రిక్స్ తో పాపులారిటీ సంపాదించి మరింత బురదను మాపై జల్లేందుకేనా అంటూ పవన్ అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఇన్నాళ్లు లేని కులం ప్రస్తావన ఇప్పుడే ఎందుకు..?
తనను తాను సినీ విమర్శకుడిగా ప్రచారం చేసుకున్న తరుణంలో కులం కార్డును ఉపయోగించని కత్తి మహేష్ కు ఇప్పుడెందుకు కులం కార్డు అవసరం వచ్చింది. తన వృత్తిలో భాగంగా తాను చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఎన్నడూ తన కులమేంటని ఎదుటివారు ప్రశ్నించరు. కానీ పవన్ అభిమానులు తనపై అగ్రహంతో వున్నారనగానే.. కత్తి మహేష్ కు కులం కార్డు అవసరమెచ్చిందా..? తప్పుడు అభియోగాలను ఇతరులపై మోపుతున్న క్రమంలో ఎవరైనా తప్పును తప్పనే అంటారుగాని.. మా కులం వాడు కాబట్టి తప్పు కూడా ఒప్పైపోతుందని ఎవరే చెప్పరు. ఈ విషయం కూడా తెలియకుండా కత్తి మహేష్ ఎందుకు కులం కార్డును వాడుతున్నారని పపన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
తాము కూడా హరిజనులమేనని, అయితే తాము నటనా పరంగా, సామాజిక సృహకలిగిన వ్యక్తిగా, రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కల్యాన్ ను అభిమానిస్తామని, ఒకటే కులం అయినంత మాత్రాన ఎందుకని పవన్ కల్యాన్ ను వ్యతిరేకించి.. కత్తి మహేష్ కు మద్దతు ఇవ్వాలా.. అని కూడా ప్రశ్నలను సంధిస్తున్నారు. కత్తి మహేష్ తాను చెప్పుకుంటున్నట్లు పాపులారిటీ సంపాదించిన వ్యక్తే అయితే.. కనీసం తన పాపులారిటీతో ఎప్పుడైనా తన సామాజిక వర్గానికి చెందిన వారికి కనీస సాయం చేశారా..? హైదరాబాదులో కాకపోయినా కనీసం తన స్వగ్రామంలోనైనా తన వర్గ యువకులకు సాయంగా, తాను అండగా వున్నానని తన వర్గం యువకులైన ఎప్పుడైనా భరోసాను ఇవ్వగలిగాడా..? అన్న ప్రశ్నలను పవన్ అభిమానులు తెరపైకి తీసుకోస్తున్నారు.
ఉస్మానియా విద్యార్ధులను సామాజిక వర్గ నేపథ్యంలో రెచ్చగోట్టి వారిని వారితో లబ్ధిపోందుదామని భావించడం సమర్థనీయమేనా..? సినీ విమర్శకుడివైన నీకు అసలు విద్యార్థులతో పనేంటి.? విద్యార్థులను సక్రమంగా విద్యాభాసం చేయాలని చెప్పాల్సిన ఓ పాపులర్ విమర్శకుడా..? నీ సార్థం కోసం..ముందుగానే విద్యార్థులను కలసి.. వారితో ప్లాన్ చేసుకుని కుటిల యత్నాలతో మాపై అరోపణలు చేయిస్తావా..? అంటూ పవన్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. కోడిగుడ్ల దాడి కేవలం కత్తి మహేష్ సహా టీవీ వాళ్ల కుట్రేనని అనుమానిస్తున్నారు అభిమానులు. ఈ దాడి వాస్తవాలను బయటకు రావాలంటే వెంటనే పోలీసులకు పిర్యాదు చేయాలని పవన్ ఫ్యాన్ సూచిస్తున్నారు.
పవన్ కల్యాన్ అభిమానులైన తాము తమ అభిమాన హీరో సూచనల మేరకు సంయమనం పాటిస్తున్నామని.. గజరాజు లాంటి తాము వెళ్తుంటే గ్రామసింహాలు ఎంతో అరుస్తాయని అయితే వాటిని పట్టించుకోబోమని కూడా చెబుతున్నారు. ఒకవేళ నిజంగా పవన్ కల్యాన్ అభిమానులే దాడి చేశారన్న కత్తి మహేష్ అరోపణలే నిజమై వుంటే.. నిన్ను ఫాలో చేసి, దాడి చేస్తే ఒక చిన్న కోడి గుడ్డు విసిరి వేసి పారిపోవాల్సిన అసరమేముంది..? ఇలా జరిగితే వెంటనే మీడియా ఎలా ప్రత్యక్షమవుతుంది.? అని ప్రశ్నిస్తున్నారు.
పనిలేని వాల్లు కవాలని పనిగట్టుకుని పవన్ కల్యాన్ పై ఆయన అభిమానులపై పసలేని అరోపణలు చేస్తూ బురదజల్లేందుకు ఈ కత్తిని పదను పెడుతున్నారని ఎందుకు అనుకోకూడదు. వాళ్లకు పరోక్షంగా సాయం అందిస్తున్న కత్తికి ఎంత లాభం ముడుతుందోనన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న అభిమానులు.. మూడో వ్యక్తితో చెడిన రోజున ఇదే కత్తి తన తప్పును తెలుసుకుంటాడని కూడా పవన్ ఫ్యాన్స్ పేర్కోంటున్నారు. ఎవరో మూడో వ్యక్తి కోసం, వారిచ్చే కాసుల కోసం అశపడి కత్తి మహేష్.. తమపై అర్థపర్థం లేని అరోపణలు చేస్తున్నారని కూడా పవన్ అభిమానులు అంటున్నారు. తప్పులెన్ను వారు తమతప్పులెరుగురు అని పవన్ అభిమానులను టార్గెట్ చేస్తున్న కత్తి తన తప్పులు కూడా తెలుసుకుని విజ్ఞతతో వ్యవహరించాలని కూడా సూచిస్తున్నారు.
పవన్ అభిమానులపై అరోపణలు ఎందుకు..?
తాను పండగ సందర్భంగా స్వగ్రామానికి వెళ్తే.. తన కంటే ముందు పవన్ కల్యాన్ అభిమానులు అక్కడికి వచ్చారని వారు తన గురించి వాకాబు చేశారని అరోపించిన కత్తి మహేష్.. తన గ్రామంలో ఓ సారి అలా తిరిగి అక్కడ ఎవరైనా పవన్ ఫ్యాన్స్ వున్నారా... అని ఎంకైరీ చేసి వుంటే తెలిసేది. ఓ పాపులర్ స్టార్ కు ఎక్కడకు వెళ్లినా అభిమానులు అనే వారు వుంటారు. స్వగ్రామంలోనే ఎందరికో తెలియని కత్తి మహేష్.. ఇలాంటి అరోపణలు చేయడం సమంజసమేనా.?
మొన్నటికిమొన్న కొడుకా కోటేశ్వరరావును పాటను ఎక్కడో సప్త సముద్రాల అవల వున్న పోలాండ్ కుర్రాడు జెబిగ్స్ పాడి దానిని పవన్ కు 2018 న్యూఇయర్ గిప్టుగా పంపాడంటే.. పవన్ అభిమానం సాగరమంత అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్న కత్తి మహేష్.. ఎలా సినీ విమర్శకుడయ్యాడో అని కూడా పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరోలపై విమర్శలు చేసే క్రమంలో ఎంతటి విమర్శకులైనా ఒకింత విజ్ఞతను పాటించాలని హితవు పలుకుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more