pawan kalyan catches the pulse by saying jai telangana పవన్ నోట.. జై తెలంగాణ మాట

Pawan kalyan catches the pulse by saying jai telangana

Pawan Kalyan Political Yatra, pawan kalyan party activists meet, Pawan fan mets accident, pawan kalyan party co-ordinators meet, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Kondagattu Anjaneya Swami Temple, pawan kalyan, janasena, party activists, co-ordinators, nizamabad, adilabad, karimnagar, telangana, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan said he was born in telangana but he took rebirth in telangana, and said jai telangana the pulse of telanganites.

ITEMVIDEOS: జై తెలంగాణ అంటూ నినదించిన పవన్ కల్యాన్

Posted: 01/23/2018 12:19 PM IST
Pawan kalyan catches the pulse by saying jai telangana

ఆంధ్రప్రదేశ్ తనకు జన్మనిస్తే.. తెలంగాణ తనకు పునర్జన్మనిచ్చిందని ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. అందుకనే తాను తన చివరి శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ తల్లికి రుణపడి వుంటానని చెప్పారు. తెలంగాణ తల్లికి శిరస్సు వంచి వందనం చేస్తానని అన్న పవన్.. అభిమానుల కోలాహలం మధ్య జై తెలంగాణ అంటూ నినదించారు. జై తెలంగాణ నినాదం వందేమాతరం నినాదంలా అత్యంత శక్తివంతమైనదని కొనియాడారు. జై తెలంగాణ అనే నినాదంలో అంత శక్తి ఎందుకుందన్న విషయాన్ని కూడా పవన్ ఈ సందర్భంగా పార్టీ సమన్యయకర్తల సమావేశంలో వివరించారు.

యావత్ దేశమంతా బ్రిటీష్ పాలకుల బాసిన శృంఖాలాలు తెగిన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నా.. తెలంగాణ మాత్రం ఇంకా బాసిన బతుకులనే ఈడ్చిందని అన్నారు. దేశమంతా స్వేఛ్చా వాయువును పీలుస్తున్నా.. తెలంగాణకు మాత్రం ఆ నూతన జీవ వాయువులు అందలేదని అవేదన వ్యక్తం చేశారు. దేశం సంతోషంగా వున్న క్రమంలో తెలంగాణలో మాత్రం చీకట్ల అలుముకున్నాయని, ఆ సమయంలోనే వారి నుంచి ఉద్భవించిన పదమే జై తెలంగాణ.. అది పదం కాదు నినాదమైంది. ఆ తరువాత కాలక్రమేనా తమ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధనకు తెలంగాణవాసులందరినీ కార్యోన్ముఖులను చేసింది.

అలాంటి పురిటిగడ్డ తనకు పునర్జన్మనివ్వడం.. అదే ఉద్యమాల పురిటిగడ్డపై తాను తన తెలంగాణ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడం అనందంగా వుందని అన్నారు. అంతకు ముందు పవన్ కల్యాన్.. తాను బస చేసిన శ్వేత హోటల్ నుంచి కరీంనగర్ పురపాలక సంఘం చేరువలో వున్న శుభం గార్డెన్స్ కు బయలుదేరి వస్తుండగా, అయనను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఈ క్రమంలో ఓ అభిమాని ప్రమాదానికి గురయ్యాడు. తలకు గాయాలై రక్తమోడుతున్నా అతను పవన్ ను చూడాలని పట్టుబట్టాడు. దీంతో సదరు అభిమానిని వేదిక వద్దకు పిలిపించి.. విషయాన్ని వివరించిన అనంతరం అతడ్ని అస్పత్రికి చికిత్సనిమిత్తం పంపించారు పవన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles