టాలీవుడ్ యంగ్ హీరో సామ్రాట్ రెడ్డిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నటుడి భార్య హర్షిత ఇచ్చిన పిర్యాదు మేరకు అతనిపై చోరి కేసును నమోదు చేసిన పోలీసులు ఇవాళ పోలిస్ స్టేషన్ కు పిలిపించి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తన ఇంట్లో నటుడి భార్య అమర్చిన సిసిటీవీ కెమెరాతో పాటు అ సెటప్ నంతా తాను ఇంట్లో లేని సమయంలో సామ్రాట్ దొంగలించాడని అమె పోలీసులకు ఇచ్చన పిర్యాదులో పేర్కోంది. అనంతరం అమె మీడియాతో మాట్లాడుతూ తన భర్త, నటుడు సామ్రాట్ రెడ్డిపై సంచలన అరోపణలు చేశారు.
తన భర్తను ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్నా..కానీ అతని నిజస్వరూపం తెలిసి తాను అందోళనకు గురవుతున్నానని హర్షిత అవేదన వ్యక్తం చేసింది. సామ్రాట్ దుర్మార్గుడని, చిన్న విషయాలకు కూడా సైకోలా మారిపోతాడని సంచలన ఆరోపణలు చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను కేసును పెట్టానని వెల్లడించింది. పెళ్లైన నాటి నుంచి ఇన్నాళ్లూ ఎన్ని కష్టాలు పెట్టినా ఎంతో సహనంతో మౌనంగా ఉన్నానని, కానీ అతని హింసిస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులను అశ్రయించానని చెప్పారు. భర్తపై గతంలో వరకట్న కేసు పెట్టిన తరవాత అమె అతనికి దూరంగా ఉండిపోయానని తెలిపారు.
సినీరంగంలో వున్నవారిని పెళ్లి చేసుకునేందుకు తనకు మొదటి నుంచి అయిష్టమేనని అయితే ఆ పీల్డ్ నుంచి వ్యాపారరంగంలోకి వస్తున్నామని చెప్పి పలుమార్లు మా తల్లిదండ్రులను అడగటంతోనే తాను సామ్రాట్ రెడ్డితో పెళ్లికి అంగీకరించానని చెప్పారు. ఇక ప్రతీ చిన్న విషయానికి తనను హింసించడంతో తాను.. ఈ విషయాలను తన అత్తకు చెప్పానని, అమె కూడా అడదన్న కోణంలో అలోచిస్తుందని అశ పడ్డానని, కానీ అమె కూడా తనను ఎంతగానో వేధించిందని హర్షిత ఆరోపించింది. తాజాగా గృహోపకరణాలను, పలు విలువైన వస్తువులను చెప్పకుండా తీసుకు వెళ్లాడని తెలిపింది.
తన పక్కనే కూర్చుని రాత్రంతా చాటింగ్ లు చేయడం, తనముందే మిగతా అడవాళ్లను ప్లర్ట్ చేయడం.. అడిగితే కొట్టేవాడని ఆరోపించింది. ఎప్పుడూ హుక్కా సెంటర్లలో తిరుగుతుంటాడని, తనకు ఆ వాసన పడదని చెప్పినా వినడని, గంటలు గంటలు కూర్చుని, హుక్కా, డ్రగ్స్ తీసుకునేవాడని ఏడుస్తూ చెప్పింది. ఖర్చులకు కావాల్సిన డబ్బుల కోసం తనతో ఉద్యోగం కూడా చేయించాడని, ఇంట్లో కూర్చుని డబ్బులకు వేధించేవాడని ఆరోపించింది. తన సేఫ్టీ కోసం తన తండ్రి సీసీటీవీ కెమెరాలను ఇంట్లో పెట్టించడం వల్లే, సామ్రాట్ పై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం లభించిందని తెలిపింది.
బయటకు తీసుకువెళ్లిన సమయంలో తనతో బాగున్నట్టు నాటకాలు ఆడుతూ, ఇంటికి వచ్చిన తరువాత శారీరకంగా, మానసికంగా వేధించేవాడని తెలిపింది. అతని గురించి ఎన్ని విషయాలు తెలిసినా, మనసులో బాధపడ్డానే తప్ప బయట పడలేదని, ఎప్పటికైనా మారుతారన్న ఆశతో చాన్నాళ్లు ఎదురు చూశానని హర్షిత చెప్పింది. తన తండ్రి షేర్లను ట్రాన్స్ ఫర్ చేసేందుకు అంగీకరించకపోవడంతో, గత ఏడాదిగా వేధింపులు ఎక్కువయ్యాయని హర్షిత వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more