cisf constables held against misbehaves charges అర్పీఎస్ లేడీ కానిస్టేబుల్ పై సిఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్ల దాడి..

Drunken cisf constables held for misbehaves against co passengers in train

drunken cisf constables ruckus in train, cisf constables misbehaviour, cisf constable held by railway police, cisf constables manhandle rpf constable, cisf constables manhandle TCs, cisf constables, ongole railway station, misbehave, co-passengers, coramandel express, manhandle, lady rpf constable, crime

drunken cisf constables held at ongole railway station for misbehaving against co-passengers in coramandel express train after manhandling lady rpf constable and TCs.

అర్పీఎఫ్ లేడీ కానిస్టేబుల్ పై సిఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్ల దాడి..

Posted: 02/05/2018 10:43 AM IST
Drunken cisf constables held for misbehaves against co passengers in train

మద్యం తాగి రూలు ప్రయాణం చేయడం సరాదాగా బావిస్తారు కోందరు. అయితే దీని ద్వారా మంచి నిద్ర పడుతుందని భావిస్తారు వాళ్లు. కాగా, ఇలాంటి ప్రయత్నమే చేసి అమితంగా మధ్యం సేవించిన ఇద్దరు సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లు.. రైలులు నానా రభసా చేశారు. రైలులోని ఇతర ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ పై దాడి చేశారు. అమె ద్వారా విషయాన్ని తెలుసుకున్న రైల్వే టీసీలు వచ్చి వారిని నిలదీయడంతో వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో రైల్వే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో అదివారం రోజును విశాఖపట్టణంలో పనిచేస్తున్న కేరళకు చెందిన శ్యామ్ కుమార్, బిన్నూ అనే ఇద్దరు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లు తమ సొంతం రాష్ట్రం వెళ్లేందుకు రైలు ఎక్కారు. రైలు విజయవాడ వచ్చాక వారికి బీ1, బీ2 బోగీల్లో సీట్లు కేటాయించారు. అయితే వారు తమ సీట్లలో కాకుండా సిబ్బందికి కేటాయించే సీట్లలో కూర్చుని టాయిలెట్‌కి వెళ్లొచ్చే మహిళలను వేధించడం మొదలుపెట్టారు. అసభ్యకర వ్యాఖ్యలతో వారిని ఇబ్బంది పెట్టసాగారు.

పలు ప్రయాణికుల ద్వారా సమాచారం అందుకున్న ఆర్‌పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ వచ్చి వారిని అడ్డుకోగా, వారు అమె పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించారు. ఒక మహిళా కానిస్టేబుల్ అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అమెపై కూడా దాడి చేశారు. దీంతో అమె విషయాన్ని రైలులోని టీసీలు రంగనాథ్, రాధాకృష్ణలకు విషయాన్ని చేరవేశారు. దీంతో వారు వచ్చి శ్యామ్ కుమార్, బిన్నూలను నిలదీసారు. దాంతో తమనే నిలదీస్తారా అంటూ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లు వారిపైనా దాడిచేశారు.

దీంతో అర్పీఎఫ్ లేడి కానిస్టేబల్ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు.. రైలులో జరుగుతున్న గొడవ పెద్దగా మారుతున్న తరుణంలో అప్రమత్తమైన ఓ ప్రయాణికుల్లో ఒకరు చైన్ లాగడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒంగోలు స్టేషన్ కు సమీపంలో రైలు ఆగింది. సమాచారం అందుకున్న ఒంగోలు రైల్వే ఎస్సై కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. టీసీల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే ఎస్సై తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles