RPF cop rescues boy from falling under moving train ఏడేళ్ల చిన్నారిని రక్షించిన అర్పీఎఫ్ కానిస్టేబుల్

Rpf cop saves life of 7 year old boy at suburban local station in mumbai

RPF personnel, moving train, Mumbai, Mumbai Local Train, Naigaon Railway Station, seven yr old boy, mumbai, maharastra

A Railway Protection Force (RPF) constable saved life of a boy from falling into the gap between platform and the track at Naigaon Railway Station.

ITEMVIDEOS: ఏడేళ్ల చిన్నారిని రక్షించిన అర్పీఎఫ్ కానిస్టేబుల్

Posted: 02/05/2018 04:28 PM IST
Rpf cop saves life of 7 year old boy at suburban local station in mumbai

దేశ అర్థిక రాజధానిగా బాసిల్లుతున్న ముంబై మహానగరంలోని సబర్బన్ రైలు ప్రయాణం నరకప్రాయమే కాదు.. యమపురికి మార్గమని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో మంది ప్రయాణికులు ఈ సబర్బన్ రైళ్ల కింద పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ క్రమంలో వారి జాబితాలో చేరబోతోన్న ఓ ఏడేళ్ల‌ బాలుడిని గ‌మ‌నించిన రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసు వెంట‌నే స్పందించి, అతడిని కాపాడిన ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని నైగాన్ రైల్వే స్టేష‌న్‌లో చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. దీనిని పలువరు నెటజనులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో సదరు కానిస్టేబుల్ సాహసోపేత చర్యలను అభినందిస్తున్నారు. ఇలా చురుకుగా స్పందించే అధికారులు రైల్వేలో వుంటే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని కూడా ప్రశంసిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే ముంబైలోని సబర్బన్ రైలును ఎక్కేందుకు ఏడేళ్ల బాలుడు తన తన తల్లితో కలిసి రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. తల్లి రైలు ఎక్కేయగా, ఆ బాలుడు రైలు ఎక్కబోయి ప్లాట్ ఫామ్ కి రైల్వే ట్రాక్ కి మ‌ధ్య‌లో పడిపోయాడు. అంతలోనే రైలు కదిలింది.
 
ఈ విష‌యాన్ని గుర్తించిన ఆర్పీఎఫ్ పోలీసు సునీల్ నాపా ఆ బాలుడిని చాలా జాగ్ర‌త్త‌గా పైకి లాగి అత‌డి ప్రాణాలు కాపాడాడు. రోజుకు సాలీనా ఎనమిది మంది ప్రయాణికులను మింగేస్తున్న సబర్బనన్ రైల్వే గత ఒక్క ఏడాది కాలంలో ఏకంగా 3 వేల 14 మంది ప్రయాణికుల ప్రాణాలను హరించిందన్న విషయం తాజాగా రైల్వే శాఖ వెల్లడించింది. సమీర్ జవవేరీ అనే ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్తకు ముంబై సబర్బన్ రైల్వే లిఖిత పూర్వకంగా తెలియజేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RPF personnel  moving train  Mumbai  Mumbai Local Train  Naigaon Railway Station  

Other Articles