Sensex off opening lows, down 1000 pts; Nifty Midcap slips 3% అమెరికా నుంచి ప్రతికూల పవనాలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Sensex off opening lows down 1000 pts nifty midcap slips 3

Sensex, nifty, LTCG, sensex today, fiscal deficit, budget, BSE, NSE, tax on capital gains, Budget 2018, Securities Transaction Tax, Budget speech, Kotak Mahindra Bank, ICICI bank

The SGX Nifty's sharp fall of 378.50 points at 10,317 following global correction indicated that benchmark indices are set to open sharply lower.

అమెరికా నుంచి ప్రతికూల పవనాలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Posted: 02/06/2018 09:34 AM IST
Sensex off opening lows down 1000 pts nifty midcap slips 3

కేంద్ర వార్షిక బడ్జెట్ లో దీర్షకాలిక మూలధనంపై పది శాతం పన్ను విధిస్తూ కొత్త నిబంధనను అమలుపర్చడంపై మదుపర్లలో అసంతృప్తి నెలకొని గత కొద్ది అయిదు రోజులుగా స్టాక్ మార్కెట్లు తిరోగమనంలో పయనిస్తున్నాయి. కాగా ఇవాళ దీనికి తోడు విదేశీ మార్కెట్ల నుంచి మరీ ముఖ్యంగా అమెరికా మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు క్రాస్ అయ్యాయి.

ఈ ఉదయం ప్రీ ఓపెన్ మార్కెట్ సెషన్ లో 700 పాయింట్ల నష్టాన్ని చూపిన సెన్సెక్స్, 9.15 గంటల సమయంలో ట్రేడింగ్ ప్రారంభం కాగానే తిరుగమనంలోకి జారుకుంది. ఏకంగా 1000 పాయింట్లకు పైగా పడిపోయింది. క్షణాల్లో ఫలితాలు తారుమారు అవుతాయనడానికి నిదర్శనంగా.. ఒక్క నిమిషం వ్యవధిలో 3 శాతానికి పైగా దిగజారిన సెన్సెక్స్ సూచిక, 9.20 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే 1,041 పాయింట్లు పడిపోయి 33,715.69 పాయింట్లకు చేరింది.

దీంతో మదపర్లు సోమ్ము లక్షల కోట్లు అవిరయ్యింది. మునుపెన్నడూ లేని కొత్త మైలురాళ్తతో దూసుకెళ్లున్న మార్కెట్ల గత వారం రోజులుగా గత కనిష్టం స్థాయిలను అందుకుంటుంది. క్రితం రోజు రూ. 1,47,95,747 కోట్లుగా ఉన్న బీఎస్ఈ సెన్సెక్స్ మార్కెట్ క్యాప్, ఇవాళ ఉదయం రూ. 5 లక్షల కోట్లకు పైగా దిగజారి రూ. 1,42,51, 795 కోట్లకు చేరింది. మరో వైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ ఏకంగా 323 పాయింట్లు పడిపోయి 10,343 పాయింట్లకు చేరింది. నిఫ్టీ-50లో ఒక్క కంపెనీ కూడా లాభాల్లో బాటలో పయనించడం లేదంటే పరిస్థితి ఎంతగా దిగజారిందోనని మదుపర్లలో అందోళన వ్యక్తమవుతుంది. టాటా మోటార్స్, వీఈడీఎల్, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు 5 నుంచి 8 శాతం మేరకు నష్టాల్లో నడుస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sensex  nifty  LTCG  tax on capital gains  fiscal deficit  budget  BSE  NSE  

Other Articles