city surronding villages to soon merge with GHMC ఆ గ్రామాలన్నీ ఇక మహానగర మణిహారంలోకే..

City surronding gram panchayats to soon merge with ghmc

Shamshabad, Ranga Reddy, poppalguda, Greater Hyderabad, madhapur, financial corridor, real boom villages, nizampat, bachupally, manikonda, bandlaguda, GHMC

Apart from Manikonda and Shamshabad, gram panchayats are expected to become part of the city civic body, including Nizampet, Bachupally, Pragatinagar, Poppalguda, Kokapet, Vattinagulapally, Narsingi and Manchirevula.

ఆ గ్రామాలన్నీ త్వరలో మహానగర మణిహారంలోకే..

Posted: 02/08/2018 11:59 AM IST
City surronding gram panchayats to soon merge with ghmc

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పరిధి మరింత విస్తరించనుందా..? నగరాన్ని ఆనుకొని ఉన్న పలు గ్రామాలు ఒక మహానగరం మణిహారంలోకి చేరిపోనున్నాయా.? ఈ గ్రామపంచాయితీలను ప్రభుత్వం త్వరలోనే జీహెచ్ఎంసీలో విలీనం చేయనుందా.? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. నగరానికి ఆనుకొని ఉన్న పలు గామ్రాలను జీహెచ్‌ఎంసీలో కలిపే అంశాన్ని పురపాలక శాఖ పరిశీలిస్తోంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ అధికారులకు అదేశాలు జారీ చేశారని సమాచారం.

ఔటర్‌ వరకు గ్రేటర్‌ పరిధి పెంచాలని ప్రభుత్వం భావించినా.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పడంతో నిర్ణయాన్ని విరమించుకున్నారు. కానీ, కొన్ని గ్రామాలను మాత్రం జీహెచ్‌ఎంసీలో కలపాలని సర్కారు గట్టిగా కోరుకుంటోంది. అయితే, ప్రజల అభిప్రాయం మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. మరోవైపు 167 గ్రామాలను జనాభా ఆధారంగా నగర పంచాయతీలు, మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో మంత్రి కేటీఆర్‌తో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
 
గ్రేటర్‌లోని వెస్ట్‌జోన్‌ అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారింది. మణికొండ, నెక్నాంపూర్‌, పుప్పాలగూడ, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్‌ తదితర ప్రాంతాల్లో నిర్మాణరంగం శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న ఆయా ప్రాంతాల్లో ప్రణాళికారహిత అభివృద్ధి జరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని నగరానికి ఆనుకొని, అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారిన ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో కలపాలని భావిస్తున్నారు.

నగర పంచాయతీలు, మునిసిపాలిటీలకు నిర్మాణ అనుమతులు జారీ చేసే అధికారులు పరిమిత స్థాయిలో ఉన్నందున.. బహుళ అంతస్తుల భవనాల అనుమతి కోసం డీటీసీపీకి వెళ్లాలి. ఈ క్రమంలో అనుమతుల జారీలో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున.. ఆన్‌లైన్‌ విధానం విజయవంతంగా అమలవుతోన్న జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
 
గ్రేటర్‌ ప్రస్తుతం 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. మణికొండ జాగీర్‌, పటాన్‌చెరు నియోజకవర్గంలోని బండ్లగూడను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు దాదాపుగా నిర్ణయించారు. పుప్పాలగూడ, నెక్నాంపూర్‌, మంచిరేవుల, హైదర్ షా కోట్, బండ్లగూడ జాగీర్‌, హైదర్‌షా కోట్‌, బండ్లగూడ, పుప్పాలగూడ, నెక్నాంపూర్‌, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్‌ తదితర గ్రామాలను విలీనం చేయాలని చర్చ జరిగినా.. స్థానికంగా తమకు ఇబ్బందికరంగా ఉంటుందని ఎమ్మెల్యేలు చెప్పినట్లు తెలిసింది. దీనిపై తర్వలోనే స్పష్టత వస్తుందని ఉన్నతాధికారొకరు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles