రైల్వేశాఖలో కొలువుల జాతర కొలువుదీరనుంది. దేశవ్యాప్తంగా 62,907 గ్రూప్-డి పోస్టుల్లో చేరే అద్భుత అవకాశాన్ని రైల్వేశాఖ యువతకు కల్పిస్తోంది. ఈ మొత్తం పోస్టుల్లో 6523 పోస్టులు కేవలం సికింద్రాబాద్ రైల్వ డివిజన్లో భర్తీ చేయనున్నారు. రైల్వేశాఖలోని గ్రూప్ డి పోస్టులకు 18 నుంచి 31 సంవత్సరాల మధ్య వయసున్న యువకులు అర్హులుగా రైల్వే అధికారులు పేర్కొన్నారు, పదోతరగతి/ ఐటీఐ/ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ పొందినవారు ఈ ఉద్యోగాలకు పోటీపడవచ్చు.
రైల్వేశాఖలో ప్రక్షాళనకు తెరతీసిన అధికారులు.. ఏకంగా 13 వేల పైచిలుకు మంది ఉద్యోగులు అనధికారికంగా దీర్ఘకాల సెలవులో కొనసాగుతన్న క్రమంలో వారిని తొలగించి వారి స్థానంలో యువరక్తాన్ని నింపేందుకు చర్యలు తీసుకుంది. ఈ ఉద్యోగాలు లభించిన యవతీయువకులకు రూ.18,000 నెల వేతనంతోపాటు ఎన్నో సౌకర్యాలు లభిస్తాయి. ఈ నియామక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత మార్కులు సాధించినవారికి శారీరక దార్ఢ్య పరీక్ష ఉంటుంది. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఇదీ పరీక్షా విధానం:
కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షలో 100 ప్రశ్నలను పూర్తి చేయడానికి 90 నిమిషాల సమయాన్ని కేటాయించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 40%, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారు 30% కనీస అర్హత మార్కులు పొందాలి. అరిథ్మెటిక్, మేథమేటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మైనస్ మార్కులు కూడా వుంటాయని అధికారులు తెలిపారు.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేయడానికి ఆఖరు తేది: 12 మార్చి 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more