selfie creates ruckus at wedding in kanpur's barra పరిణయ వేదికపై వధువుతో అపరిచితుడి సెల్ఫీ..

Selfie creates ruckus at wedding in kanpur s barra

ruckus at wedding, ruckus at wedding in Kanpur, ruckus at wedding in Kanpur's Barra, ruckus at wedding in Barra, ruckus at wedding in uttar pradesh, selfie ruckus in wedding, ruckus, wedding, kanpur, barra, selfie, stranger, uttar pradesh, social media, viral video, crime

Ruckus at a wedding in Kanpur's Barra, after the bride's family objected to a man clicking a selfie with her. Bride relatives lodge Police complaint.

ITEMVIDEOS: పరిణయ వేదికపై వధువుతో అపరిచితుడి సెల్ఫీ..

Posted: 02/15/2018 01:37 PM IST
Selfie creates ruckus at wedding in kanpur s barra

పెళ్లి చేసి చూడు.. ఇళ్లు కట్టి చూడు అన్నది పాత నానుడి.. ఎందుకంటే పెళ్లి అన్నది ఖర్చుతోనే కాదు అనేక అంశాలతో ముడిపడిన బంధమన్నది తెలియంది కాదు. ఇక అడపిల్లల పెళ్లి చేయాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వుస్తుందన్నది కూడా ఈ నానుడికి అర్థంగా చెబుతుంటారు పెద్దలు. అయితే ఇది ఓ నాటి కాలానికి సంబంధించిన మాట. ఈ తరం యువతీ యువకులు ఒక్కటి కావాలని భావిస్తే.. ఈవెంట్ నిర్వహణ సంస్థలు, క్యాటరింగ్ చేసేవారు. రెడీ మేడ్ కళ్యాణ మండపాలు అన్ని అందుబాటులోనే వున్నాయి. ఈ రోజుల్లో పెళ్లి చేసి చూడు అన్నడం పెద్ద పనే కాదు అనేవారు కూడా లేకపోలేదు.

అలాంటి అభిప్రాయానికి వచ్చే వారికి ఈ పెళ్లే ఓ చక్కని ఉదాహరణ. డీజే సిస్టమ్ వున్న పేళ్లి వేదిక అది. అంటే రమారమి మధ్యతరగతి వర్గాలకు చెందిన పెళ్లి వేదికగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పెళ్లిలో అనుకోంకుడా ఓ వింతపని చోటుచేసుకుని రచ్చ రచ్చ అయ్యింది. ఎంతలా అంటే.. తనకు పిల్లనిచ్చి మామపైనే వరుడు చేయిచేసుకోవడం.. అంతటితో అగిందా అంటే లేదు.. వరుడిపైనే వధువు చేయిచేసుకుంది. ఇక ఓ మహిళైతే ఏకంగా తన చెప్పుతీసి రెడ్డీ అయింది. ఇదంతా ఎందుకని అంటారా..? లేటెస్టుగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ.. ఈ రచ్చకు అసలు కారణం. అదే సెల్పీ.

ఇక ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్ లోని బార్రా ప్రాంతంలో ఓ పెళ్లి జరిగింది. ఇక కట్నాలు, కానుకుల సమయం వచ్చింది. ఇంతలో బంధుమిత్రులు తమ తమ స్థాయి కొద్ది వధూవరులను కలసి అశీర్వదించి.. శుభాకాంక్షలను అందజేస్తూ.. బహుమతులను అందజేస్తున్నారు. ఇంతలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. బంధుమిత్రుల పాటుతో వచ్చిన ఓ వ్యక్తి.. ఫోటోలు దిగాడు. అంతటితో అగకుండా ఏకంగా స్టేజి మీదకి వచ్చి పెళ్లికూతురితో సెల్ఫీ తీసుకోబోయాడు. అయితే అతను ఎవరో తెలియదన్నట్లు హావభావం వ్యక్తం చేసిన వధువు దూరంగా జరిగింది.

దీంతో వరుడి బంధువులు అతడ్ని కిందకు లాగి చితకబాదారు. అయితే పెళ్లిలో ఇలాంటి ఘటనలు ఎందుకున్న ఉద్దేశ్యమో ఏమోగాని ఆ యువకుడ్ని కొట్టకండని వధువు తండ్రి వరుడి తరపు బంధువులను వారించాడు. మరేం జరిగిందో తెలియదు కానీ.. ఆ తరువాత ఏకంగా వరుడి వెళ్లి.. తన పిల్చనిచ్చిన మామపై దాడి చేశాడు. అంతే తన కళ్లెదుటే తన తండ్రిపై దాడి చేస్తావా అని అగ్రహానికి లోనైన వధువు కూడా తానెం తక్కువా అంటూ ఏకంగా వరుడి చెంపచెల్లుమనిపించింది. దీంతో వివాహంలో గందరగోళం నెలకొని రసాబాసగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనపై పెళ్లికూతురి బంధువుల నుంచి పోలీసులు ఫిర్యాదు అందుకున్నారు..

#WATCH: Ruckus at a wedding in Kanpur's Barra, after the bride's family objected to a man clicking a selfie with her. Police complaint lodged. pic.twitter.com/zVTp4df8kt

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ruckus  wedding  kanpur  barra  selfie  stranger  uttar pradesh  social media  viral video  crime  

Other Articles