Teacher Saved Many During Florida Shooting ఆ లెక్కల టీచర్ కూడికలే ప్రాణాలను కాపాడాయి..

Heroic indian origin teacher saved many during florida shooting

shanti viswanathan, florida shooting, fire alarm, suspect, swat team, parkland school, america, school, shooting, fl, florida, high, mrs. v, shanti viswanathan, Marjory Stoneman Douglas, hero, SWAT, algebra, Cruz, Nikolas, Nicholas, parkland, shot, dead, injury, gun, suspect, Broward, davie, students, faculty, staff, police, aaron feis, Ashley Kurth, Melissa Falkowski, Jim Gard

An Indian-American math teacher saved her students from Florida shooting by covering classroom door's window, ordering kids to the floor and refusing to let anyone in... even the SWAT team

ఆ లెక్కల టీచర్ కూడికలే ప్రాణాలను కాపాడాయి..

Posted: 02/17/2018 01:09 PM IST
Heroic indian origin teacher saved many during florida shooting

అమె లెక్కల టీచర్., విద్యార్ధులకు అవసరంగా అన్ని లెక్కల్ని నేర్పిస్తారు. అదే తన ప్రాణాలపైకి వస్తుందన్న తరుణంలో తన కోసం ఎవరినైనా బలిపెడతాగు. అంటే తీసివేతలు. కానీ ఇక్కడ ఈ భారతీయ టీచర్ శాంతి విశ్వనాథన్ మాత్రం తాను ఎదుర్కోన్న విపత్కర సమయంలోనూ కూడికలనే అశ్రయించి.. తన విద్యార్థుల ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేసింది. అదే అమెను ఇప్పుడు సంచలనంగా మార్చివేసింది. క్రితం రోజున అమెరికాలోని ఫ్లోరిడాలో గల పార్క్ ల్యాండ్ హైస్కూల్ ఘటనలో 17 మంది విద్యార్థులు అసువులు బాసారు.

ఈ ఘటనలో అద పాఠశాలలో గణితశాస్త్రం బోధిస్తున్న భారతీయ టీచర్ సమయస్ఫూర్తి.. అందరి ప్రశంసలు పొందుతోంది. అదే పాఠశాలకు చెందిన విద్యార్థి క్రమశిక్షణా ఉల్లంఘనలకు పాల్పడటంతో అతడ్ని సస్పెండ్ చేశారు. దీనిని భరించలేని సదరు విద్యార్థి తుపాకీని చేతబట్టి నేరుగా పాఠశాలలోకి ప్రవేశించి.. కాల్పులకు తెగబడ్డాడు. అడ్డుకోబోయిన ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందని కాల్చివేశాడు. అంతేకాదు పాఠశాలలోని విద్యార్థులపై కూడా కాల్పులకు తెగబడ్డాడు.

ఫైర్ అలారం మోగించి కాల్పులకు తెగబడ్డటంతో.. అదే సమయంలో క్లాసులో ఉన్న భారతీయ టీచర్ శాంతి విశ్వనాథన్.. అలారం శబ్దం వినగానే అమె కూడా అలర్ట్ అయ్యింది. బయటకు వెళ్లకపోవడమే మంచిదనుకొని.. విద్యార్థులను క్లాసులోనే ఉండాలని శాంతి ఆదేశించారు. అంతేకాదు అందరినీ ఓ మూలకు వెళ్లి నేలపై నిశబ్దంగా పడుకోమని సూచించారు. ఆ వెంటనే ఓ చిన్న పేపర్ తీసుకెళ్లి.. క్లాసు రూమ్ డోర్‌పై ఉన్న కిటికీని క్లోజ్ చేశారు. దీంతో రూమ్‌లో ఎవరున్నారనే విషయం బయట వారికి తెలియకుండా చేశారు.
 
ఇంతలో కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్‌కు చేరుకున్నారు. హంతకుడు స్కూల్ లోనే దాక్కున్నాడని తనిఖీలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే శాంతి క్లాస్ రూమ్‌కి వచ్చారు. డోర్ తెరవమని హెచ్చరించారు. వచ్చింది హంతకుడేమో అనుకుని.. తెరవకుండా అలాగే ఉండిపోయారు. తాము పోలీసులమని చెప్పినా ఆమె ససేమీరా అన్నారు. కావాలంటే సీక్రెట్ లాక్ తో డోర్ ఓపెన్ చేయాలన్న అమె సూచనమేరకు అలా చేసిన పోలీసులు ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చి బయటకు పంపించారు. సమయస్ఫూర్తితో పిల్లలను కాపాడారంటూ.. శాంతిని ప్రశంసలతో ముంచెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shanti viswanathan  florida shooting  fire alarm  suspect  swat team  parkland school  america  

Other Articles