సీనీ పక్కిలో పోలీసుల కళ్లలో కారం చల్లి రిమాండ్ ఖైదీగా వున్న తమ గ్యాంగ్ స్టర్ ను అనుచరులు తీసుకెళ్లిన ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వెంటనే తేరకున్న పోలీసులు వారి వాహనాల టైర్లను కాల్చేందుకు కాల్పులు జరిపినా.. జనసామర్థ్యం అధికంగా వుండటంతో వారు యధేశ్చగా తప్పించుకున్నారు. అయితే పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగిందన్నఅరోపణల నేపథ్యంలో అందుకు బాధ్యులైన ముగ్గురు పోలీసులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అయితే నిందితులను బేడీలతో తీసుకురాకూడదన్న అంక్షల కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు బాధిత పోలీసుల అరోపిస్తున్నారు.
ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఓ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా వున్న గ్యాంగ్‌స్టర్ సందీప్ కుమార్ అలియాస్ సంజయ్ అలియాస్ ధిలూ పంటి నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో ఈనెల 9న మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ కు తీసుకొచ్చిన పోలీసులు అతనికి మైనర్ సర్జరీ చేశారు. మళ్లీ ఈ నెల 19న తీసుకురావాలన్న వైద్యుల సూచనలతో క్రితం రోజున ధిల్లూను అస్పత్రికి తీసుకువచ్చారు. అయితే ఈ సమాచారాన్ని తెలుసుకున్న అతని అనుచరులు అతడ్ని తప్పించేందుకు ప్రణాళిక వేశారు.
సోమవారం ఏఎస్సై బ్రజ్ మోహన్, నరేశ్ పాల్, హెడ్ కానిస్టేబుల్ యోగేందర్ లు థిల్లూను ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యుల చేత పరీక్షలు చేయించారు. ఇక అతడ్ని తమ అదుపులోకి తీసుకుని మళ్లి రిమాండ్ కు తరలించే క్రమంలో పోలీసులు ఉదయం 11:15 గంటల సమయంలో అస్పత్రి నుంచి బయటకు వస్తుండగా, అప్పటికే గేటు దగ్గర రెండు బైకులు, ఒక స్కూటర్ పై మాటువేసిన ధిల్లూ అనుచరులు.. పోలీసుల కళ్లలో కారం చల్లారు. వారు కారం మంటలతో తల్లడిల్లతుండగానే ధిల్లూ ను అక్కడి నుంచి తప్పించి తమ వాహనాలపై ఎక్కించుకుని పారిపోయారు.
ఈ హఠాణ్పరిణామంతో షాక్ కు గురైన పోలీసులు తేరుకుని స్కూటర్‌పై పారిపోతున్న ధిల్లూ వాహనా టైర్లను కాల్చేందుకు కాల్పులు జరిపారు. అయితే మరో పోలీసు వారి చెంతకు చేరకుని పట్టుకునే ప్రయత్నం చేయగా, చంపేస్తామని అగంతకులు తమ చేతిలోని తుపాకీని గురిపెట్టడంలో అతని వదిలిపెట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే అస్పత్రి వద్ద జనసామర్థ్యం అధికంగా వుండటంతో వారు తప్పించుకున్నారు. కాగా, పోలీసుల జరిపిన కాల్పుల శబ్దానికి ఆసుపత్రిలోని రోగులు, వైద్యులు భయభ్రాంతులకు గురయ్యారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more