CBI Arrested Karti Chidambaram in Money Laundering Case | చిదంబరంకు షాక్.. తనయుడు కార్తీ అరెస్ట్

Chidambaram son karthi arrested

Karti Chidambaram. CBI, Karti Chidambaram Arrest, INX Media, Money Laundering Case, Karti, S Bhaskararaman, Chidambaram Son Arrest

INX Media Money Laundering case: CBI arrests Karti Chidambaram at Chennai Airport. CBI officers were interrogating Karti at the Chennai airport after he landed from London. He will now be brought to Delhi. On Monday, a Delhi court sent Karti Chidambaram’s chartered accountant S Bhaskararaman to 14-day judicial custody.

చిదంబరంకు షాక్.. కార్తీ అరెస్ట్

Posted: 02/28/2018 10:44 AM IST
Chidambaram son karthi arrested

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి చిదంబరం కు షాక్ తగిలింది. ఈ ఉదయం ఆయన కుమారుడు కార్తీ చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసు నేపథ్యంలో కార్తీని చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు.

లండన్ నుంచి తిరిగివచ్చిన ఆయనను ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేసి, తమ కార్యాలయానికి తరలించారు. సీబీఐ ఇన్వెస్టిగేషన్ కు సరిగ్గా సహకరించని నేపథ్యంలోనే ఆయన్ని అరెస్ట్ చేసినట్లు సమాచారం. విచారణ కోసం ఆయన్ని ఢిల్లీకి తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, కార్తీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ ఎస్.భాస్కరరామన్ ను ఢిల్లీ కోర్టు సోమవారం నాడు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. ఈడీ అధికారులు భాస్కరరామన్ ను కోర్టులో ప్రవేశపెట్టగా... స్పెషల్ జడ్జ్ ఎన్కే మల్హోత్రా ఆయనను కస్టడీకి తరలిస్తూ తీర్పును వెలువరించారు. వెంటనే అక్కడ నుంచి ఆయనను తీహార్ జైలుకు పోలీసులు తరలించారు. ఫిబ్రవరి 16న ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ లో భాస్కరరామన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

స్కామ్ నేపథ్యం...
యూపీఏ హయాంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్ఎక్స్ మీడియా స్కాం చోటు చేసుకుంది. 2007లో ఐఎన్ఎక్స్ మీడియా నిధులు పొందేందుకు వీలుగా ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎప్ఐపీబీ) అనుమతులు మంజూరు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles