AMU Students Seeks Apologies from President Kovind | రాష్ట్రపతి క్షమాపలు చెబితేనే రానిచ్చేది!

Students demand apology from president kovind

Ram Nath Kovind, AMU Students, AMU Convocation, Apology, Ram Nath Kovind UP Students, Ram Nath Kovind Controversial Comments

Apologise for 2010 Statement Before Attending Convocation. AMU Students' Union to President Ram Nath Kovind. Kovind, a BJP spokesperson at the time, had said that the reservation for socially and economically backward religious and linguistic minorities was not possible as it would be ‘unconstitutional’ to include Muslims and Christians in Scheduled Caste category.

రాష్ట్రపతి క్షమాపణలు చెప్పాలని డిమాండ్

Posted: 03/01/2018 05:48 PM IST
Students demand apology from president kovind

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నిరసన సెగలు తగిలేలా కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థులు ఆయన రాకను నీరసిస్తూ ఆందోళన చేపట్టారు. అందుకు కారణం ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు.

గతంలో చేసిన వ్యాఖ్యలకు కోవింద్ క్షమాపణలు చెప్పాలని... లేకపోతే స్నాతకోత్సవానికి హాజరుకావడం మానుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రపతి వ్యాఖ్యల పట్ల విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా... దానికి రాష్ట్రపతి, వైస్ ఛాన్సెలర్ మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.

గతంలో చేసిన వ్యాఖ్యలు.. 2010లో బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆయన... రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికపై స్పందిస్తూ, ముస్లింలు, క్రిస్టియన్లను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. కమిషన్ సిఫారసులు అమలు చేయడం సాధ్యం కాదని చెప్పారు. మరి సిక్కులకు ఈ కేటగిరీలో స్థానాన్ని ఎలా కల్పించారని ప్రశ్నించగా... సిక్కులు భారతీయులని... ఇస్లాం, క్రైస్తవ మతాలు మన దేశానికి పరాయివని అన్నారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే మళ్లీ తెరపైకి వచ్చి ఆయన ప్రదర్శనకు అడ్డుగా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles