బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు తెలుగు దేశం పార్టీపై నిప్పులు చెరిగారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉంది కాబట్టే మిత్రధర్మాన్ని పాటిస్తూ ఓర్పు వహిస్తున్నామని, కానీ, టీడీపీ మాత్రం ఆపని చేయడం లేదని విష్ణుకుమార్ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం వెలగపూడిలో మీడియాతో మాట్లాడిన ఆయన, మాట్లాడుతూ... తాము నోరు తెరిస్తే చాలా విషయాలు చెప్పాల్సి వస్తుందని, పరిస్థితి అంతదూరం రానీయకుండా తన నేతలను చంద్రబాబు కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. దేశాభివృద్ధికి ప్రధాని ఎంతో కృషి చేస్తుంటే, ఈ తరహా విమర్శలు సరికాదని హితవు పలికారు.
విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇప్పటికే ఎంతో సాయం అందిందని, ఏపీకి ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని అన్నారు. తామూ లెక్కలు తీయగలమని, చాలా అంశాలపై తమ వద్ద సమాచారం ఉందని ఆయన అన్నారు. టీడీపీలో గూండాలు, రౌడీలకు మాత్రమే పదవులు ఇస్తున్నారంటూ ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రూ. 5 లక్షల కోసం హత్యలకు పాల్పడేవారిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రూ. 10 లక్షలు ఇస్తే తనను కూడా హత్య చేస్తారని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి డుమ్మాకొట్టి... నిరసన కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఎమ్మెల్యే వాసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హత్యకేసులో నేరస్తుడైన వ్యక్తి... ప్రధానమంత్రికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తాడా అంటూ మండిపడ్డారు. టీడీపీ నేతలు మోదీని నిత్యమూ తూలనాడుతుంటే, చంద్రబాబు చూస్తూ ఊరకున్నారని అన్నారు. కాగా, నిన్న విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి రైలు ఆకృతిలో ప్లెక్సీలు తయారు చేయించి, వాటి మధ్య నిలబడి, 'మోదీ మెడలు వంచుతాం' అంటూ వినూత్న నిరసన నిర్వహించిన సంగతి తెలిసిందే.
టీడీపీ నేతల కౌంటర్...
ఈ ఉదయం మీడియా ముందుకు వచ్చిన బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు, సీఎం చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడగా, టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. విష్ణు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు, చంద్రబాబును ఓ మాట అనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హితవు పలికారు. బీజేపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రంతో మాట్లాడి విభజన హామీలను అమలు చేయించాలని, అది వదిలేసి న్యాయమైన కోరికలను తీర్చాలని అడుగుతున్న టీడీపీని విమర్శించడం ఏంటని ప్రశ్నించారు.
బీజేపీ నేతలు తమ వైఖరిని మార్చుకుని కేంద్రంపై ఒత్తిడిని పెంచేందుకు సహకరించాలని, లేకుంటే వారికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. పార్లమెంట్ లో వైసీపీ చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ధి ఎంతమాత్రమూ లేదని వ్యాఖ్యానించిన ఆంజనేయులు, జగన్ కేవలం అధికారం కోసమే పాదయాత్ర చేస్తున్నాడని, ఆయన కోరిక నెరవేరే పరిస్థితి లేదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more