tdp mp jc diwakar reddy challenges ycp mps at parliament మీసం మేలసి, తొడగొ్ట్టి సవాల్ విసిరిన జేసీ.. ‘సై’ అన్న వైసీపీ..

Tdp mp jc diwakar reddy challenges ycp mps at parliament

jc diwakar reddy, MP, YSRCP, YCP MPs, TDP MPs, Andhra pradesh special status, YCP MPs dharna, gandhi statue, parliament, viral video

TDP parliament member of ananthapuram JC Diwakar reddy creates an interesting scene which was captured by the media today at the parliament. He goes to the YCP mps dharna point and challenges them to resign, interstingly they too said we are ready which made jc to skip from thera after twirling his mustache and slaping thigh in seeme faction movies style.

ITEMVIDEOS: మీసం మేలసి, తొడగొ్ట్టి సవాల్ విసిరిన జేసీ.. ‘సై’ అన్న వైసీపీ..

Posted: 03/08/2018 05:23 PM IST
Tdp mp jc diwakar reddy challenges ycp mps at parliament

పార్లమెంట్‌ సాక్షిగా అంధ్రప్రదేశ్ ఎంపీలు తమ నిరసన ధ్వనులను కొనసాగిస్తునే వున్నారు. ఇన్నాళ్లు సభా కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తూ అందోళన చేసిన టీడీపీ ఇక తమ పంథాను మార్చి ఏకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకోవడంతో పాటు ఎంపీలు తమ పదవులకు రాజీనామాలను కూడా సమర్పించే చివర ఘట్టానికి చేరుకుంది. అంతేకాదు ఎన్డీయే ప్రభుత్వంలో పదవులను అనుభవిస్తున్న కేంద్రమంత్రులు అశో్క గజపతి రాజు, వైఎస్ చౌదరిలు కూడా తమ పదవులకు రాజీనామా సమర్పించే యోచనలో వున్నారు. ఈ మేరకు ఇదివరకే పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అదేశాలను కూడా జారీ చేశారు.

ఇక రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష వైసీపీ ఎంపీలు మాత్రం పార్లమెంటు ఆవరణలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తూ నినాదాలు చేశారు. ఇంతవరకు బాగానే వుంది.. ఇక్కడ మరో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. అందోళన చేస్తున్న వైసీపీ ఎంపీల వద్దకేగి.. ప్రత్యేక హోదా కోసం గాంధీ విగ్రహం ఎదుట ధర్నాలు చేస్తూ.. నినాదాలు ఇవ్వడం కాదు దమ్ముంటే తమలా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు అనంతపురం టీడీపీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి. అంతటితో అగలేదు.. ఏకంగా తొడగొట్టి.. మీసం మెలేస్తూ వైసీఫీ ఎంపీలకు సవాల్ విసిరారు.

దీనికి వైసీపీ ఎంపీలు కూడా ప్రతిసవాల్ విసిరారు. తాము కూడా రాజీనామాలకు సిద్దమని చెప్పారు. దీంతో జేసీకి ఏం చేయాలో తొచక మళ్లీ మీసం మెలేసి తాను చెప్పిందే మళ్లి చెబుతూ అక్కడి నుంచి జారుకున్నారు. అయితే నాలుగేళ్లుగా తాము చెబుతున్నా వినకుండా కేంద్రాన్ని తమ భుజాలపై మోసిన టీడీపీ ఎంపీలు.. సరిగ్గా ఎన్నికల ముందు మేల్కోని మీసాలు మెలేయడం, తొడలు చరచడం లాంటివి చేస్తే ప్రజలు హర్షించరని.. ఇవన్నీ ఎన్నికల జిమ్ముక్కులేనని వారు అర్థం చేసుకోగలరని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక మరికొందరు నేతలు మాత్రం జేసీ కొంతకాలం వేదాంతాలు మాట్లాడి.. మరికొంత సేపు తొడగొడతారని ఎద్దేవా చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles