mla roja questions chandrababu on women empowerment.? మహిళా సాధికారతపై చంద్రబాబుకు రోజా ప్రశ్నల వర్షం..

Ycp mla roja questions chandrababu on women empowerment

RK roja, MLA, YSPCP, call money issue, rishiteshwari, vanajakshi, krishna pushkaram stampede, chandrababu, Bhuvaneshwari, heritage, women empowerment, andhra pradesh

ysrcp mla roja slams andhra pradesh cheif minister chandra babu naidu on his tweet regarding women empowerment, question cm on many issues regarding the same.

మహిళా సాధికారతపై చంద్రబాబుకు రోజా ప్రశ్నల వర్షం..

Posted: 03/10/2018 04:20 PM IST
Ycp mla roja questions chandrababu on women empowerment

మహిళా సాధికారతకు తమ ఇల్లే ఉదాహరణ అని.. సేవా రంగంలో తాను 24 గంటలు నేను బిజీగా ఉంటే.. తన వ్యాపారాలను తన భార్య కోడలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారని.. తానతో పాటు తన అబ్బాయి కూడా ఆర్థికంగా వారి మీద ఆధారపడుతున్నామని ట్విట్ చేసిన అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశల్న వర్షం కురిపించారు. చంద్రబాబును చూస్తుంటే తన ఇల్లు బాగుంటే లోకమంతా బాగుందని అభిప్రాయపడే ధోరణిలో వ్యవహరిస్తున్నారని అమె ఎద్దేవా చేశారు. తన కొడుకుకి మంత్రి ఉద్యోగం ఇచ్చేసి రాష్ట్ర యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేశాయన్న భావనలో వున్నారని విమర్శించారు.

వారింట్లో సాధికారత వచ్చేసింది కాబట్టి రాష్ట్రం అంతా సాధికారత వచ్చేసిందనడానికి సిగ్గు పడాలిని అమె తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు మహిళా వ్యతిరేకి అని అన్నారు. ఎన్నికల ముందు ఆడపిల్లలందరికీ సెల్ ఫోన్లు కొనిస్తానని మానిఫెస్టో పెట్టి.. వారిని నాలుగేళ్లుగా మభ్యపెట్టడమేనా మహిళా సాధికారత అంటే అని ప్రశ్నించారు. చదువుకునే ఆడపిల్లలకి ఐప్యాడ్లు ఇస్తామని ఓట్ల వేయించుకుని.. ఆ మాటే మర్చి రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించామని చెప్పడం విడ్డూరమని అన్నారు.

* కృష్ణా పుష్కరాలలో వీఐపీ ఘాట్ వదిలి సామాన్య ఘాట్ లో స్నానాలను అచరించడంతో పాటు ప్రముఖ దర్శకుడితో షూటింగ్ చేయించి అమ్మాక అడపడచుల మరణాలకు కారణం కావడమేనా మహిళా సాధికారత అంటే..? అని ప్రశ్నించారు.

* నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి మరణానంతరం అనేక డ్రామాలకు తెరలేపిన తరువాత అందుకు బాద్యుడైన బాబురావును నెల రోజుల తరువాత అరెస్టు చేయడమేనా మహిళా సాధికారత అంటే..? అని నిలదీశారు.

* తమ పార్టీ ఎమ్మెల్యే నిరంకుశంగా సాగిస్తున్న ఇసుక వ్యాపారాన్ని అడ్డుకుంటే.. అమెపై చేయి చేసుకుని.. రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులంతా మూకుమ్మడిగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపడితే.. అందుకు బాద్యుడైన ఎమ్మెల్యేను వెనకోనుకుని వచ్చి.. ఎమ్మార్వో వనజాక్షిని శాంతిపర్చడమేనా.? మహిళా సాధికారత అంటే..? అని ప్రశ్నించారు.

* రాష్ట్రంలో ఎంతో అట్టహాసంగా నిర్వహించిన మహిళా కాంగ్రెస్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అరెస్టు చేసి.. అక్రమ నిర్భంధం మధ్య హైదరాబాద్ కు తరలించడమేనా మహిళా సాధికారత అంటే..? అని నిలదీశారు.

* ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేను ఏడాది పాటు సస్పెండ్ చేసి అది కూడా తన ఘనతగా చెప్పుకోవడం నిజంగా మహిళా సాధికారతేనని అఅన్నారు.

* కాల్ మనీ ముసుగులో అడపడచులను విలాసవస్తువులుగా బలవంతపు బ్లాక్ మెయిల్ శృంగారాలకు పాల్పేడ కాలనాగుల్ని పెంచిపోషించడమేనా మహిళా సాధికారత అంటే అని నిలదీశారు.

* ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను పారిశ్రామికంగా ఎదిగేలా చేస్తామని, వ్యాపారస్తులుగా చేస్తామని చెప్పిన చంద్రబాబు.. తన ఇంట్లోని ఇద్దరు మహిళలను బినామీ డబ్బుతో పారిశ్రామికంగా ఎదిగేలా చేశారని రోజా ఆరోపణలు చేశారు. ఇది మహిళా సాధికారతా? అని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RK roja  MLA  chandrababu  Bhuvaneshwari  heritage  women empowerment  andhra pradesh  

Other Articles