bride looking at the grooms beard refused to marry పెళ్లి పీటలపై పంతం నెగ్గించుకున్న నవవధువు..

Bride refuses to marry groom for being bald on wedding day

bride refuses to marry groom, grooms beard makes bride refuse to marry, Marriage, engagement, shaving, Unique event, khandwa district, madya pradesh, neurologist, bihar

A bride refused to marry her groom, who came to kalyan mandap with his beard, bride denies to marry him with beard and sends a message to get shaved in ajanti village of khandwa district in madya pradesh, after one such incident in bihar on feb 28th.

వరుడి గడ్డమే అడ్డామా..? పెళ్లి చేసుకోనని అలిగిన వధువు..

Posted: 03/14/2018 11:57 AM IST
Bride refuses to marry groom for being bald on wedding day

పెళ్లంటే నూరేళ్ల పంట.. పెళ్లితో పెద్దలు, తప్పట్లు, తాళలు, వేద పండితుల మంత్రోచ్చరణలు, హోమాలు, ఏడు అడుగులు ఇలా అన్ని కలసి పంచభూతాల సాక్షిగా రెండు మనస్సులు ఒక్కటి కావడమే కల్యాణం. అంతకుముందు ఒకరికొకరు తెలియని వధువరులు.. పెళ్లి బంధంలో జీవితాంతం ఒకరికోకరుగా జీవిస్తారు. ఇటీవల బీహార్ లో ఉన్నత కుటుంబానికి చెందిన పెళ్లిలో జరిగిన ఘటనే తాజాగా మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో కూడా చోటుచేసుకుంది. బీహార్ లో న్యూరాలజిస్టును పెళ్లి చేసుకునే సమయంలో అతనికి గడ్డం వుండటంతో పెళ్లికి నిరాకరించింది వధువు. దీంతో వరుడు ఏలాంటి అక్షేపణ లేకుండా క్లీన్ షేవ్ చేసుకుని రావడంతో అ పెళ్లి అనుకున్నట్లుగానే ముగిసింది.

ఇక తాజాగా మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లా అజంటీ గ్రామంలో మాత్రం ఇదే గడ్డం పెళ్లికి అడ్డంగా మారింది. ముహూర్తం దాటిపోయినా.. గడ్డం విషయంలో వధూవరులు సమోద్యకు రాకపోవడంతో.. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని వరుడ్ని ఒప్పించడంతో మరుసటి రోజు ఉదయం మరో ముహూర్తానికి వివాహం జరిగింది. అసలేం జరిగిందంటే.. వివాహ వేదిక వద్దకు వరుడు మంగల్‌సింగ్ బంధువులతో సహా ఊరేగింపుగా వచ్చాడు. అయితే వరుడికి గడ్డం ఉండటాన్ని గమనించిన వధువు రూపాలీ... తనను వివాహం చేసుకోనంటూ అలిగికూర్చుంది. వరుడు మంగల్ సింగ్ షేవింగ్ చేసుకుంటేనే తాను వివాహం చేసుకుంటానని చెప్పింది.

పెళ్లి జరిగే కల్యాణ వేదిక వద్ద వధువు షరుతు విన్న వరుడు ససేమిరా అన్నారు. తనకు గడ్డమే అందమని, దానిని ఎలా తీస్తానని మంకుపట్టుపట్టాడు. అంతేకాదు తాను వరుడ్ని.. తన మాట వదువు తరపువారు వినాలి తప్ప.. వధువు తరపు వారి మాటలను తాను లక్షపెట్టడమేంటని అక్షేపించాడు. దీంతో పెళ్లి వేడుకలో గందరగోళం ఏర్పడింది. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం మొదలైంది. కల్యాణమండపంలో కాకూడదని ఏదో జరుగుతుందన్న అందోళన నేపథ్యంలో గ్రామస్థులు పోలీసుల సాయం కోరారు. దీంతో పోలీసులు వరుడికి నచ్చజెప్పడంతో గడ్డం తీసుకునేందుకు అంగీకరించాడు వరుడు. దీంతో రూపాలీ, మంగల్ సింగ్ లు మరుసటి రోజున మరో ముహూర్తానికి ఒక్కటయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bridegroom  beard  Marriage  engagement  shaving  Unique event  khandwa district  madya pradesh  neurologist  bihar  

Other Articles