Indian Army warns, Chinese hackers targetting WhatsApp +86 నెంబరుతో జరభద్రం.. భారత అర్మీ హెచ్చరిక..

Army warns of chinese stealing data hacking systems through whatsapp

WhatsApp, Indian Army, Hackers, Chinese hackers, additional directorate general of public interface, digital hackers, +86 number, whatsapp groups, general audit, Indian army warning

The Indian Army released a video accusing Chinese hackers of targeting users in India via WhatsApp. The video, urging people to use the social messenger application safely.

ITEMVIDEOS: +86 నెంబరుతో జరభద్రం.. భారత అర్మీ హెచ్చరిక..

Posted: 03/20/2018 09:30 AM IST
Army warns of chinese stealing data hacking systems through whatsapp

ఇండియన్ అర్మీలో పనిచేసే తమ సిబ్బందికి సోషల్ మీడియాతో దూరంగా వుండాలని అదేశాలను జారీ చేసిన భారత అర్మీ అధికారులు.. సరిగ్గా నాలుగు నెలల క్రితం ఏకంగా భారత సరిహద్దు ప్రాంతాలలో పనిచేస్తున్న భారత అర్మీదళ సిబ్బంది తమ స్మార్ట్ ఫోన్లలో పలు యాప్ లను వినియోగించరాదని కూడా అదేశాలను జారీ చేసింది. దీంతో అర్మీ నుంచి ఎలాంటి భారతీయ సమాచారం చౌర్యానికి గురికాకుండా చర్యలు తీసుకుంటున్న ఆర్మీ తాజాగా భారతీయ పౌరులకు కూడా హెచ్చరిక చేసింది.

స్మార్ట్ ఫోన్లలో మరీ ముఖ్యంగా వాట్సాప్ వినియోగించి.. అదే ప్రపంచమని భావించే నేటి యువతకు ఈ హెచ్చరికల పట్ల మరింత అప్రమత్తంగా వుండాల్సిన అవసరముంది. వారెవరో తెలియకపోయినా.. వారు పంపించే సందేశాలకు ప్రతిస్పందించి.. వారిని మీ ఫోన్ లోకి రాణిస్తే ఇక మీ వ్యక్తిగత సమాచారం గోవింద. అంటే మీకు తెలియకుండానే మీ ఫోన్ లో నిక్షిప్తమైవున్న సర్వసమాచారం హ్యకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఇదే ఇండియన్ ఆర్మీ చేసిన హెచ్చరిక.

అయితే ఎవరో దేశీయులు చేస్తే పట్టుకునే అవకాశాలు వున్నాయి కానీ, చైనా దేశీయులు మన ఫోన్లను హ్యాక్ చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారని ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది. చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు భారత యూజర్లను లక్ష్యంగా చేసుకుని వాట్సాప్‌ను హ్యాక్ చేస్తున్నారని, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారని పేర్కొంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను ట్వీట్ చేసింది.

86 ప్రారంభమయ్యే నంబరుతో ఎవరైనా గ్రూపులో చేరితే అప్రమత్తం కావాలని సూచించింది. మొబైల్ నంబర్లు మార్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని, పాత సిమ్ కార్డులను పూర్తిగా విరగ్గొట్టాలని పేర్కొంది. చైనా హ్యాకర్లు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి కూడా దూసుకొస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని భారత ఆర్మీ కోరింది. మీ వాట్సాఫ్ గ్రూపులలో ఎవరైనా +86 నెంబరుతో వుంటే వెంటనే వారిని తొలిగించాలని, వాట్సాప్ గ్రూపులలో ప్రతీ ఒక్కరిని నెంబరుతో కాకుండా పేరుతోనే ఫీడ్ చేసుకోవాలని అర్మీ సూచనలు జారీ చేసింది. ఇక తరచూ మీ వాట్సాప్ గ్రూపులలో ఎవరైనా +86 నెంబరుతో చేరారా..? అని చూసుకోవడం కూడా తప్పనిసరిని హెచ్చరించింది.

 सजग रहे,सतर्क रहें,सुरक्षित रहें।#भारतीयसेना सोशल मीडिया उचित एवं नियमबद्ध एकाउंट को प्रोत्साहित करता है। हैकिंग जोरो पर है, उनके लिए जो असावधान हैं। अपने सोशल मीडिया को हमेशा चेक करें। व्यक्तिगत एवं ग्रुप एकाउंट के बारे में सावधान रहें, सुरक्षित रहें। @DefenceMinIndia @PIB_India pic.twitter.com/YQbdVFsmWe

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : WhatsApp  Indian Army  Chinese hackers  digital hackers  +86 number  whatsapp groups  general audit  

Other Articles