Banking Fraud By Kanishk Gold Company ప్రజలపై మరో బడాసంస్థ శఠగోపం.. 14 బ్యాంకులకు టోకరా

Kanishk gold defrauds 14 banks including sbi pnb in scam worth rs 824 crore

kanishk gold, Chennai, Tamil Nadu, PNB, SBI, Union Bank of India Rs 50 crore, Syndicate Bank Rs 50 crore, Bank of India Rs 45 crore, IDBI Bank Rs 45 crore, UCO Bank Rs 40 crore Tamilnad Mercantile Bank Rs 37 crore, Andhra Bank Rs 30 crore, Bank of Baroda Rs 30 crore, HDFC Bank Rs 25 crore, ICICI Bank Rs 25 crore, Central Bank of India Rs 20 crore and Corporation Bank

Another bank fraud has been exposed in Tamil Nadu. Jewellery chain Kanishk Gold has been named in defrauding 14 banks including PNB and the state bank of India with amount as close to as Rs 824 crore.

ప్రజలపై మరో బడాసంస్థ శఠగోపం.. 14 బ్యాంకులకు టోకరా

Posted: 03/21/2018 04:24 PM IST
Kanishk gold defrauds 14 banks including sbi pnb in scam worth rs 824 crore

ప్రభుత్వ రంగ బ్యాంకులలో వున్న డబ్బు రమారమి సామాన్యులదే. బడాబాబులు బ్యాంకుల్లో డ్బబులు వేయరు. అదే తమ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే ఎంతో వడ్డీ వస్తుందని లెక్కలు వేస్తారు. అయితే బాడాబాలు మాత్రం బ్యాంకుల్లో వున్న సామాన్యుల డబ్బును రుణాలుగా పొంది ఏకంగా బ్యాంకులకు టోకరా వేసి ప్రజలకు శఠగోపం పెడుతున్నారు. ఇప్పటికే విజయ్ మాల్యా, నిరవ్ మోడీ, అగర్వాల్, కోఠారీ, లలిత్ మోడీలు వేల కోట్ల రూపాయల రుణాలను పోంది దేశం విడిచి వెళ్లారు.

విదేశాలకు వెళ్లినవాల్లు ఏకంగా మేము భారత్ తిరిగిరాము.. భారత్ చట్టాలను ఎదుర్కొవడం మా తరం కాదు అని నిసిగ్గుగా ఎగవేతదారులు చెబుతున్నారు. ఈ జాబితాలోకి మరొక బంగారు ఆభరణాల వ్యాపార సంస్థ కూడా చేరిపోయింది. తమిళనాడుకు చెందిన కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా 14 బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులకు కూడా టోకరా వేసింది. మొత్తంగా ఈ జాబితాలో సుమారు రూ.800 కోట్ల మేరకు ముంచేసినట్లు సమాచారం.
 
ఈ నేపథ్యంలో జనవరిలోనే ఎస్బీఐ బ్యాంకు అధికారులు ఈ ఎగవేతపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ఆశ్రయించి, సహాయం కోరింది. చెన్నైలోని టీ.నగర్ లో రిజిస్టర్డ్ కార్యాలయం ఉన్న కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.824.15 కోట్ల మేరకు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించడం లేదని ఆరోపించింది. ఈ సంస్థ ప్రమోటర్లు, డైరెక్టర్లు అయిన భూపేష్ కుమార్ జైన్, ఆయన భార్య నీతా జైన్ తమకు అందుబాటులో లేకుండా పోయారని తెలిపింది. వారు ప్రస్తుతం మారిషస్ లో ఉన్నట్లు తమకు సమాచారం విశ్వసనీయ సమాచారముందని తెలిపింది.
 
ఎస్బీఐ ఆధ్వర్యంలో 14 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడి కనిష్క్‌కు రుణాలిచ్చాయి. ఈ ఏడాది జనవరి 25న సీబీఐకి ఎస్‌బీఐ చేసిన ఫిర్యాదులో కనిష్క్ తమను మోసం చేసిందని, రికార్డులను తారుమారు చేసిందని, అకస్మాత్తుగా దుకాణాన్ని మూసేసిందని ఆరోపించింది. రుణాల అసలు రూ.824 కోట్లు కాగా, వడ్డీతో సహా దాదాపు రూ.1,000 కోట్లు తమకు నష్టం జరిగిందని పేర్కొంది. ఎస్బీఐ ఫిర్యాదుపై సీబీఐ ఎఫ్ఐఆర్ ఇంకా నమోదు కావలసి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanishk Gold  SBI  PNB  consortium  CBI  scam  Bhoopesh Kumar Jain  Neeta Jain. tamilnadu  Mauritius  Crime  

Other Articles