posani krishna murali challenges Tdp for ap special status ITEMVIDEOS: పవన్ కల్యాన్ కు జైకోట్టిన పోసాని. బాబుకు సవాల్..

Posani krishna murali challenges chandrababu for ap special status

posani krishna murali, director posani, actor posani, writer posani, tammareddy bharadwaja, mlc rajendra prasad, tollywood celebrities, awardees first, pawan kalyan, APSP, TDP, YSRCP, no confidence motion, TRS, AiADMK, BJP, lok sabha, rajya sabha, Union Govenment, Andhra pradesh, special status, congress, andhra pradesh, politics

Renowned tollywood director, writer, actor posani krishna murali gives befitting reply to Tdp MLC Rajendra prasad, challenges TDP for indefinite hunger strike at vijayawada.

ITEMVIDEOS: పవన్ కల్యాన్ కు జైకోట్టిన పోసాని. బాబుకు సవాల్..

Posted: 03/21/2018 06:55 PM IST
Posani krishna murali challenges chandrababu for ap special status

తెలుగు చిత్రపరిశ్రమపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే కౌంటర్లను ఇవ్వగా, ఇదే అంశంపై ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి మద్దుతు పలికినన్నినాళ్లు మంచోడుగా వున్న పవన్ విమర్శలు చేస్తే.. రాష్ట్రానికి హోదా గురించి అడిగితే.. రైల్వేజోన్ గురించి అడిగితే చెడ్డవాడయ్యాడా అని నిలదీశారు. పవన్ కల్యాన్ ఉన్నత వ్యక్తిత్వాలు, భావాలు, అలోచనలు వున్న వ్యక్తని పోసాని అన్నారు.

పవన్ ఒక సినిమా చేయాలని తన వద్దకు వస్తే తాను బ్లాక్ చెక్ ఇస్తానని, దానిపై ఆయన ఎన్ని సున్నాలైనా వేసుకోవచ్చునని, 40 కోట్లు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని పోసాని అన్నారు. ఇది తాను చెప్పడం కేవలం పవన్ కల్యాన్ కు ఇప్పుడున్న డిమాండ్ అలాంటిదని చెప్పారు. భారతదేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న స్టార్ పవన్ కళ్యాన్ అని అన్నాడు. అలాంటి వ్యక్తిని కేంద్రంతో లోపాయికారి ఒప్పందం చేసుకోవడం, లాలూచీ పడ్డారని విమర్శించడం దారుణమని అన్నారు.

పవన్ కల్యాన్ తమను అధికారంలోకి తెచ్చినప్పుడు దేవుడిలా కనబడ్డాడు.. హుద్దూత్ తుఫాను వచ్చినప్పుడు రూ.50 లక్షలను విరాళంగా ఇచ్చినప్పుడు స్పందించే గోప్ప మనస్సున్న మనిషిలా కనబడ్డాడు.. హోదా కోసం అడిగగానే, ఎంపీలు ఏంచేస్తున్నారని ప్రశ్నించగానే విమర్శించిన టీడీపీ నేతలే కాదా అని నిలదీశారు. చంద్రబాబు నిజంగా సీనియర్ నేత, అపార అనుభవం వున్న పాలనాధ్యక్షుడిగా నమ్మిన పవన్ కల్యాన్.. అభివృద్దిని కాంక్షించి టీడీపీ కోసం ప్రచారం చేశాడని.. గెలిపించాడని అన్నారు.

కానీ ఇప్పుడు చంద్రబాబు అసలు స్వరూపం తెలిసిపోయింది. నిజనిర్థారణ కమిటీలో చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాలు, అధికారులపై పెత్తనం, వోటుకు నోటు కేనులపై ప్రశ్నించగానే మీరు ఉండబట్టలేక, ఆయన తత్వం తెలిసి కూడా ఆయనపై విమర్శలు చేస్తారా..? అని ప్రశ్నించారు. నిజానిజాలు తెలిసాయి కాబట్టే పవన్ టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారని అన్నారు. ‘‘పవన్ కు రాజకీయాలు అవసరం లేదు. రాజకీయాలకే పవన్ అవసరం” అని పోసాని తన అభిప్రాయాపడ్డారు.

ఇక ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ సినీ పరిశ్రమను అగౌరవపరిచేలా చేసిన వ్యాఖ్యలకు ఆయన భేషరుత్తుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు ఏ సమస్య వచ్చినా చిత్ర పరిశ్రమ సాయానికి ముందు నిలిచిందని.. అలాంటిది కొందరు రాజకీయ నాయకులు పరిశ్రమను టార్గెట్ చేయడం మంచిది కాదన్నారు. ప్రత్యేక హోదా కోసం విజయవాడలో దీక్షకు వచ్చిన సినిమా వాళ్లని, రాష్ట్ర యువతను లాఠీలతో కొట్టించింది చంద్రబాబు ప్రభుత్వం కాదా.?, ఒక్కొక్కరినీ తరిమితరిమి కొట్టిన సంగతి మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా ఇక ముగిసిపోయిన అంశం.. దానికంటే ప్యాకేజీ ముఖ్యం అని చంద్రబాబు చెబితే మనస్ఫూర్తిగా నమ్మామన్నారు. ఇప్పుడు మోదీతో చంద్రబాబుకు ఏవో గొడవలొస్తే అదేదో ఏపీ ప్రజల సమస్యగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్‌? అప్పుడేమో ప్యాకేజీ, ఇప్పుడేమో ప్రత్యేక హోదా అంటూ మాట తప్పిన వాళ్లను లోఫర్‌ అనేకదా అంటారని ఆయన ఘాటు విమర్శలు చేశారు. ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరూ కోరుకోరుకదా..’ అని చంద్రబాబు అంటే మేం జేజేలు కొట్టాలా, డబ్బులిచ్చి పక్కపార్టీ ఎమ్మెల్యేలను కొనుకుక్కుంటే సంతోషంగా మద్దతు పలకాలా? బ్రోకర్‌ చంద్రబాబు మాటలు నమ్మి మేం పోరాటాలు చెయ్యాలా..’ అని పోసాని ఫైర్ అయ్యారు.

నిన్నటి వరకు హోదా కోసం మాట్లాడిన వాళ్లను చెత్తవెధవలని అన్న మీరే.. సడన్ గా మాటమార్చి హోదా అంటే.. మిమల్ని ఏం అనాలని..? ఆయన ప్రశ్నించారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కేవలం ఒక్కటే మార్గమని, విజయవాడ నడిరోడ్డుమీద చంద్రబాబు, తన క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమరణ దీక్ష చేయాలని, దానికి తాను కూడా వస్తానని.. తనతో పాటు సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా వస్తారని అన్నారు. మరిఇందుకు మీరూ సిద్దమేనా..? అంటూ ఆయన సవాల్ విసిరారు హోదా కోసం తాను ప్రాణాలు వదిలెయ్యడానికి కూడా సిద్ధమని.. మరీ మీలో ఎవరికైనా ఆ తెగింపు ఉందా అంటూ టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా మీద పిల్లిమొగ్గలేయడమే పనిగా పెట్టుకున్న టీడీపీ.. సినిమా వాళ్ళను విమర్శించే హక్కు లేదన్నారు.

ఇక మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే చిత్రం ప్రీరిలీజ్ పంక్షన్లో పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి హరికృష్ణ, కళ్యాణ్ రామ్ లు విభిన్నమైన వ్యక్తులని వారు మరింత సక్సెస్ కావాలని కోరుకుంటూనని అన్నారు. అయితే అసందర్భమైనా మరొక్క మాట చెప్పాలని ఉందన్ని ఆయన టీడీపీలో ప్రకంపనలు పుట్టించే వ్యాఖ్యలు చేశారు.

కళ్యాణ్ రామ్ మంచి లక్షణాలున్న వ్యక్తులు కేవలం వెండితెరలపైనే ఎంఎల్ఏలుగా రావడం సరికాదని, ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని కూడా పోసాని అకాంక్షించారు. కళ్యాణ్ రామ్..మీ కుటుంబం రాజకీయాల్లోకి రావాలి. తెలుగుదేశం పార్టీ మీది. మీరు రాజకీయాల్లోకి వస్తేనే ఎన్టీఆర్ సంతోషపడతారు. ఆ కుటుంబం నుంచి నీలాంటి వాడు వస్తే, ప్రజలు బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది” అంటూ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles