highways blocked in AP, demanding special status ఎక్కడికక్కడ దిగ్బంధమైన జాతీయ రహదారులు

All parties highway blockage agitation on full swing in andhra pradesh

pawan kalyan, APSP, TDP, YSRCP, no confidence motion, TRS, AiADMK, BJP, lok sabha, rajya sabha, highways, janasena, congress, ysrcp, cpi, cpm, Andhra pradesh special status, congress, andhra pradesh, politics

All parties in Andhra pradesh supported to left parties agitation of highway blockage, demanding special status to andhra pradesh, is sucessfull as all parties participated and blocked state and national roads.

ఎక్కడికక్కడ దిగ్బంధమైన జాతీయ రహదారులు..

Posted: 03/22/2018 10:35 AM IST
All parties highway blockage agitation on full swing in andhra pradesh

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ప్రత్యేక రైల్వే జోను డిమాండ్ చేస్తూ వామపక్షాలు, ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ సంయుక్తంగా ఇచ్చిన రాష్ట్ర జాతీయ రహదారుల దిగ్బంధం పిలుపుతో రాష్ట్రంలోని ఎక్కడి ట్రాఫిక్ అక్కడే స్థంభించిపోయింది. టీడీపీతో పాటు, వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌, వామపక్షాలు ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించాయి. దీంతో జాతీయ రహదారుల నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు మాత్రం ఎక్కడిక్కక్కడ గస్తీని ఏర్పాటు చేశారు.

విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ విశాఖలో అఖిలపక్ష నాయకులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. మద్దిలపాలెం జంక్షన్ లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు ఉన్న 16వ నంబర్‌ జాతీయ రహదారిని దిగ్బంధం చేసిన అఖిలపక్ష నేతలు ఇప్పటికైనా కేంద్రం తెలుగోడిని తక్కువగా అంచనా వేయవద్దని హెచ్చరించారు.  కేంద్రం ఇప్పటికైనా విభజన హామీలు నెరవేర్చకపోతే ఇది ప్రజా ఉద్యమంగా మారుతుందని నేతలు హెచ్చరించారు.

* అనంతపురం-బెంగళూరు జాతీయ రహదారిపైనా ఆందోళనకారులు  రాస్తారోకో చేపట్టి వాహనాలను అడ్డుకుంటున్నారు.
* కృష్ణాజిల్లా నందిగామలో విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని దిగ్భందం చేశారు.
* చెన్నై-కలకత్తా జాతీయ రహదారిపై రామవరప్పాడు కూడలి వద్ద టీడీపీ నేతృత్వంలో ధర్నా
* విజయవాడ, విశాఖ, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలో జనసేన సభ్యుల నిరసనలు
* రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వామపక్షాల నేతలు రోడ్లపైకి వచ్చి అందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
* ప్రధానమంత్రి మోదీకి వ్యతిరరేకంగా డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles