Lok Sabha fails to take up no-confidence motion tenth day 10వ రోజు పరిస్థితిలో మార్పులేదు.. అవిశ్వాసంపై చర్చకు తావులేదు..

Ls adjourned till monday government says ready for discussion on ncm but

Lok Sabha, Government of India, Parliament of India, Mahajan, Motion of no confidence, Adjournment, Speaker of the Lok Sabha, Sumitra Mahajan, Cauvery river, Ananth Kumar, Congress, AIADMK, Speaker, Mallikarjun Kharge, politics

The Lok Sabha today on tenth day also failed to take up again notices for no-confidence motion against the government after Speaker Sumitra Mahajan said the House was not in order and adjourned proceedings amid noisy protests over various issues to april 2nd.

అవిశ్వాసానికి సిద్దమే కానీ.. అంటున్న కేంద్రం.. సోమవారానికి లోక్సభ వాయిదా..

Posted: 03/28/2018 12:04 PM IST
Ls adjourned till monday government says ready for discussion on ncm but

లోక్ సభలో పదవ రోజు కూడా అవిశ్వాస తీర్మాణాలపై చర్చ లేకుండానే వాయిదా పడింది. అటు కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు.. ఇటు అంధ్రప్రదేశ్ కు చెందిన అధికార టీడీపీ, విపక్ష వైసీపీ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణంపై పదో రోజు కూడా షరామామూలుగానే వాయిదా పడింది. రోజూ సాగే తంతుమాదిరిగానే లోక్ సభ ప్రారంభం కాగానే అన్నాడీఎంకే సభ్యులు అందోళనకు దిగారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఆ తరువాత 12 గంటలకు తిరిగి ప్రారంభమైన సభలో కూడా మార్పు లేకపోవడంతో సభ ఏప్రిల్ 2 సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్.

ఈ క్రమంలో రెండో పర్యాయం ప్రారంభమైన లోక్ సభలో తమ అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, సీపీఎం, ముస్లిం లీగ్, తృణముల్ సహా పలు పార్టీలు.. వాటిపై చర్చించాలని డిమాండ్ చేశాయి. అయితే తొలుత లోక్ సభ ప్రారంభం కాగానే రెండు నిమిషాల పాటు కూడా సాగకుండానే అన్నాడీఎంకే సభ్యులు చేస్తున్న అందోళన నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ గంట పాటు వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు ప్రారంభమైన సభలో అన్నాడీఎంకే సభ్యుల నినాదాల మధ్యనే స్పీకర్ ప్రశోత్తరాలను కొనసాగించారు. దీంతో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలని కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే పట్టుబట్టారు.

దీంతో బీజేపి పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ జోక్యం చేసుకుని తమ ప్రభుత్వం అవిశ్వాసంపై సిద్దంగా వుందని అన్నారు. అయితే సభలో విపక్షంగా వున్న కాంగ్రెస్ కావాలని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం పెట్టిందని అన్నారు. ఇక అవిశ్వాస తీర్మాణం పెట్టడానికి వారు తమతో వున్న సభ్యుల సంఖ్యను కూడా పేర్కొంటూ ఇచ్చారని, ఇదే సభావ్యవహరాలకు భిన్నంగా సాగిన ప్రక్రియ అని చెప్పారు. సభలో అవిశ్వాసంపై చర్చ జరిగేందుకు ముందు అప్పుడు సభలో సభ్యుల సంఖ్యను లెక్కించాల్సి వుందని, కానీ అలా కాకుండా అవిశ్వాసానికి మద్దతు తెలిపే సంఖ్యను పేర్కోంటూ ఇవ్వడం సభ నిబంధనలకు వ్యతిరేకమన్నారు. కాగా అవిశ్వాసంపై తమ ప్రభుత్వం చర్చకు సిద్దమని అయన మరోమరు చెప్పారు.

దీనికి బదులిస్తూ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే.. కేంద్రమంత్రి అభ్యంతరాలకు వివరణ ఇస్తూ ఏదో చెప్పబోగా.. స్పీకర్ సుమిత్రా మహాజన్ తనకు అదేమీ వినిపించడం లేదంటూ చెప్పారు. ఈ క్రమంలో సభను అమె (ఏప్రిల్ 2) సోమవారానికి వాయిదా వేశారు. దీంతో కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం ప్రోత్సహంతోనే అన్నాడీఎంకే ఎంపీలు సభలో గంధరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. కేంద్రం, అన్నాడీఎంకే పార్టీలు కలసి సభను వాయిదాపర్వానికి పరిమితం చేశారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అటు రాజ్యసభలో ప్రధాని మోడి, విపక్ష నేత అజాద్ సహా అన్ని పార్టీల నేతలు రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న సభ్యులకు ఘనంగా విడ్కోలు పలికుతూ ప్రసంగాలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles