ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం ICICI కు భారీ షాక్ తగిలింది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న ఆరోపణలతో ICICI కు 59 కోట్ల భారీ జరిమానా విధించింది భారతీయ రిజర్వు బ్యాంకు. ఈ మేరకు మార్చి 26, 2018న ఆర్బీఐ ఒక నోటీసు జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ లకు ఆర్బీఐ జరిమానా విధించిన తరువాత తాజాగా ఐసీఐసీఐ బ్యాంకుకు కూడా ఈ జరిమానా పడింది.
సెక్యూరిటీ బాండ్ల ప్రత్యక్ష అమ్మకాల్లో నిబంధనలు పాటించని ఐసీఐసీఐ బ్యాంకుపై భారీ పెనాల్టీని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం, ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్ తన హెచ్ఎంటీ పోర్ట్ పోలియో గురించిన పూర్తి వివరాలు అందించడంలో విఫలమైందని ఆరోపిస్తూ, రూ. 58.9 కోట్ల జరిమానా విధించారు. సెక్యూరిటీ బాండ్ల విషయంలో నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని, బ్యాంకు ఈ నిబంధనలను పాటించలేదని వెల్లడించిందని ఇవాళ తెలిపింది.
ఈ జరిమానా కారణంగా లావాదేవీల వ్యాలిడిటీ, లేదా బ్యాంకు తమ కస్టమర్లతో చేసుకున్న ఒప్పందాలపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 లోని సెక్షన్ 46 (4) (i) తో సెక్షన్ 47ఏ (1) (సి) లోని నిబంధనల ప్రకారం ఆర్ బీఐ జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలకు బ్యాంకులు కట్టుబడి ఉండాలని తెలిపింది. వాటిని అతిక్రమంచినందుకు గాను ఐసీఐసీఐ బ్యాంకుకు ఈ జరిమానాను విధిస్తున్నట్లు ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ జోస్ కే ఖట్టూర్ ఈ నోటీసుల్లో వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more