Chandrababu is Congress covert, alleges Veerraju ఎట్టెట్టా..! కాంగ్రెస్ తో చంద్రబాబు చట్టాపట్టాలా.?

Chandrababu works for congress victory in karnataka alleges bjp

Lingayats, reservations, Dalits, Karnataka Elections, mysuru, PM Modi, Amit shah, siddaramaiah, chief minister, karnataka, congress, chandrababu, somu veerraju, andhra pradesh, politics

Andhra pradesh chief minister Chandrababu naidu working for congress victory in karnataka alleges BJP MLC somu veerraju, this leader also steps ahead and says he had mer congress former chief sonia gandhi in this regard,

ఎట్టెట్టా..! కాంగ్రెస్ తో చంద్రబాబు చట్టాపట్టాలా.?

Posted: 03/31/2018 01:31 PM IST
Chandrababu works for congress victory in karnataka alleges bjp

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ఏపీ బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన అరోపణలు చేశారు. ఆయన కాంగ్రెస్ కోవర్టుగా మారిపోయారని తీవ్రస్తాయిలో ఫైరయ్యారు. కర్నూలులో ఆ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటకలో వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీని ఓడించి.. కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు చంద్రబాబు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీతో రహస్య ఒప్పందం చేసుకన్నారని అరోపించారు.

ఈ మేరకు ఇప్పటికే అమెతో రహస్యంగా భేటీ అయ్యి పలు అంశాలపై చర్చలు కూడా నిర్వహించారని అన్నారు. చంద్రబాబు కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు నిర్ణయించుకున్నారని ఇక దీనిలో ఏ కొత్త అంశం లేదన్నారు. రానున్న ఎన్నికలలో బీజేపితో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ సీట్లు అడుగుతామనే ఉద్దేశంతోనే ఆయన ఎన్డీయే నుంచి బయటకు వచ్చారని విమర్శించారు. గతంలో మోదీని పొగిడిన చంద్రబాబు ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఆయనను తిడుతున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో అవినీతిని చూసి పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ముందుకు రావడం లేదని అరోపణలు గుప్పించారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనకాడుతున్నాయని అరోపించిన ఆయన ఈ పరిస్థితి ఎంత దారుణమో అలోచించాల్సిన అవసరం ముందన్నారు. రాష్ట్రాభివృద్ధిని అమరావతికే పరిమితం చేశారని దుయ్యబట్టారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప డమ్మీగా మారారని, రాష్ట్రంలోని ఓ ఎమ్మెల్యే అనధికారికంగా హోంమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles