జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కోసం ఓ మిస్డ్ కాల్ ఇస్తే చాలునని గుంటూరులోని మంగళగిరి సభలో జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాన్ ప్రకటించి సరిగ్గా నేటికి 19 రోజులు.కానీ సభ్యత్వాలు సంఖ్య మాత్రం ఏకంగా 17 లక్షలు. రమారమి రోజుకు లక్ష మంది చొప్పున జనసేన సభ్యత్వాలు నమోదువుతున్నాయంటే.. పార్టీ అధినేతపై అభిమానంతో పాటు పార్టీని విశ్వసిస్తున్న వారి సంఖ్యకూడా ఇక్కడ ప్రతిభింబిస్తుంది. ఇదే జోష్ లో అభిమానులకు మరింతగా చేరువయ్యేందుకు జనసేన సరికొత్త యాప్ ను కూడా తీసుకురానుంది.
జనసేన ఆవిర్భావ మహాసభలో అధినేత పవన్ పిలుపు మేరకు మిస్డ్ కాల్ తో ఇప్పటికి 17 లక్షల మందికి పైగా సభ్యులుగా చేరారని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో మిస్డ్ కాల్ తో పాటుగా మరో విధంగా కూడా సభ్యత్వాలను నమోదు చేయడం కోసం ప్రత్యేకంగా జనసైన్యం పేరుతో ప్రత్యేక యాప్ ను కూడా ఏప్రిల్ 2 నుంచి సభ్యులకు అందుబాటులోకి తీసుకురాన్నామని జనసేన ఐటీ విభాగం వెల్లడించింది. దీంతో జనసేన కార్యక్రమాలన్ని ఎప్పటికప్పుడు పార్టీ సభ్యులతో పంచుకునే అవకాశం వుంటుందని తెలిపారు.
నిజాయతీగల రాజకీయాలతో పటిష్ఠమైన పౌర సమాజం నిర్మించేందుకు జనసేన కట్టుబడి ఉందని జనసేన ప్రతినిధి విజయ నిర్మల అన్నారు. పార్టీ సభ్యులుగా కేవలం పార్టీ అధినేత దర్శనీకతలో నడుస్తామని విశ్వాసమున్న సభ్యులందరినీ చేర్చుకుంటామని అమె తెలిపారు. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నవారిలో యువతే అధికంగా వున్నారని తెలిపారు. సుమారుగా 40 శాతం మంది పార్టీకి వాలంటీర్లుగా సేవ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. యాప్ ద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియ మరింత సులభం అవుతుంది. జనసైన్యం పేరుతో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది' అని చెప్పారు.
ఐటీ విభాగం తరఫున శ్రీనివాస్ మిరియాల మాట్లాడుతూ.. '93940 22222 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు సభ్యులు కావచ్చు. వారి ఫోన్ కి యూనిక్ మెంబర్ షిప్ ఐడీ వస్తుంది. మెంబర్ షిప్ వెబ్ సైట్ లోకి లాగిన్ కావడానికి ఒక లింక్ కూడా పంపిస్తాం. తమ ఫోటో, ఎంపిక చేసుకున్న భాషలో ఈ-మెంబర్ షిప్ కార్డు కూడా తీసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో పూర్తవుతుంది. పార్టీ కోసం వారు ఎక్కడ, ఎలాంటి పని చేయదలచుకున్నారో కూడా తెలియజేసే వెసులుబాటు అందులో ఉంటుంది. పార్టీ వాలంటీర్లు తమ చుట్టుపక్కల వారిని సభ్యులుగా నమోదు చేసే యాప్ ద్వారా ఏప్రిల్ 2 వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more