Nine killed as tractor falls into canal in Nalgonda నల్గొండలో ఘోరం.. కాలువలో పడిన ట్రాక్టర్.. 9మంది మృతి

Nine killed several injured as tractor they were travelling in falls into canal

amrp canal, labour work, labourers, p a pally mandal, padamati thada, swimmers, telangana updates, tractor, vaddipatla grama panchayat, canal accident, death toll injuries, tractor falls into canal, Nalgonda road accident, tractor overturns, Alimineti Madhava Reddy Project canal, AMRP canal, Waddipatla village, Nalgonda, telangana

Nine people have been killed and several others have been injured after a tractor-trolley that they were travelling ran off the road and fell into a canal. The accident took place in Telangana’s Nalgonda.

నల్గొండలో ఘోరం.. కాలువలో పడిన ట్రాక్టర్.. 9మంది మృతి

Posted: 04/06/2018 10:01 AM IST
Nine killed several injured as tractor they were travelling in falls into canal

నల్గొండ జిల్లాలో ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 30 మంది వ్యవసాయ కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ ఏలిమినేటి మాదవరెడ్డి వ్యవసాయ కాలువలో పడిపోగా, ట్రాక్టర్ లోని అందరూ కాలువలో పడిపోయారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా, పది మంది గల్లంతయ్యారని సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు నీటికాలువలో పడినవారిని రక్షించే కార్యక్రమాలను చేపట్టేలోపే, 9 మంది మృతిచెందారు. కాగా, కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు.

కూలీలంతా వద్దిపట్లలోని పడమటి తండా నుంచి పులిచర్ల సరిహద్దుల్లోని మిరపచేనులో కూలీ పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి వచ్చి గల్లంతైన వారికోసం స్థానికుల సాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. గాయపడిన ఐదుగురిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్టు పోలీసులు తెలిపారు. నీటిలో ట్రాక్టర్ కింద మరికొన్ని మృతదేహాలు ఉండి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

మృతులను రమావత్‌ కేలీ(50), రమావత్‌ కంస్లి(50), రమావత్‌ భారతి(35), రమావత్‌ సునీత(30), జరుకుల ద్వాలి(30), రమావత్‌ లక్ష్మిగా గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. ఈ ఘటనలో సుమారు 15 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాద సమాచారం తెలియగానే స్థానికులు, కూలీల బంధువుల అక్కడికి చేరుకున్నారు. విగతజీవులుగా మారిన తమవారిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles