woman molested at night, accused arrested కదులుతున్న రైలులో మహిళపై లైంగిక వేధింపులు

Caught on cam man molests woman in mumbai local train

woman molested in Mumbai, Mumbai local train, Chhatrapati Shivaji Terminus railway station, sexual assault on woman, dadar_kurla local train, Dadar Railway Station, molestation attack, violence against woman, crime against woman, molestation, rape, sexual assault, local train, moving train, mumbai, maharastra, crime

A woman was molested and beaten up onboard a Dadar-Kurla local train on Thursday night despite the presence of a guard, bringing into question Mumbai's image of being a safe city for women.

ITEMVIDEOS: కదులుతున్న రైలులో మహిళపై లైంగిక వేధింపులు

Posted: 04/06/2018 03:22 PM IST
Caught on cam man molests woman in mumbai local train

దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటనలు తరచూ వెలుగు చూడడంతో దేశరాజధాని మహిళలు అసలు సురక్షితమే కాదన్న వాదనలు బలంగా వినబడుతుండగా..  రమారమి అవే సరిస్థితులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ ఉత్పన్నమవుతూ మహిళల భద్రతపై పలు ప్రశ్నలను ఉత్పన్నం చేస్తూ అందోళనకరంగా మారుస్తున్నాయి. అత్యంత దారుణంగా, అందరూ చూస్తుండగా.. అందులోనూ అక్కడే వున్న ఓ పోలీసు గార్డు కూడా కళ్లప్పగించి వేడుక చూస్తుండగా, ఓ వ్యక్తి కదులుతున్న రైలులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డిన ఘటన మహిళ భద్రత అంశాన్ని లేవనెత్తుతుంది.

ముంబైలో దాదర్‌-కుర్లా లోకల్‌ ట్రెయిన్‌లో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. దివ్యాంగులకు కేటాయించిన కంపార్ట్ మెంట్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు తోటి ప్రయాణికురాలి పట్ల లైంగిక వేదింపులకు దిగాడు. అక్కడున్న వారంతా దివ్యాంగులు కావడంతో ఎవరూ అతన్ని అడ్డుకోలేకపోయారు. ఇంత జరుగుతున్నా పక్కనే లేడిస్ కంపార్ట్ మెంట్లో ఉన్న సెక్యురిటీ గార్ఢు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆగంతకుడు సదరు మహిళలను శారీరకంగా వేదిస్తున్న దురాగతాన్ని పాక్షిక అంధుడైన సహ ప్రయాణికుడు వీడియో తీసి నెట్టింట్లో పెట్టడంతో అదికాస్తా వైరల్‌ అవుతోంది.

కామాంధుడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బాధితురాలు ప్రమాదపుటంచులకు కూడా వెళ్లింది. మగమృగాన్ని తీవ్రంగా ప్రతిఘటించే క్రమంలో ఆమె ఒక సందర్భంలో ట్రెయిన్‌ డోర్‌ దగ్గరకు వెళ్లింది. కొంచెమైతే ఆమె ప్రమాదానికి గురయ్యేదే. అయితే చాకచక్యంగా వ్యవహరించి ఆమె ధైర్యంగా అతనికి ఎదురు తిరగడంతో ప్రమాదం తప్పింది. దుండగుడు ఓ టాక్సీ డ్రైవర్ మహిళపై అఘాయిత్యానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పక్కనున్న బోగిలోని వారు తమ చేతుల్లోని సెల్ పోన్లలో దానిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప.. మహిళను దుండగుడి నుంచి కాపాడుదామన్న అలోచన ఒక్కరికీ లేకపోయింది. అయితే తోటివారి సహాయంతో అతన్ని రైల్వే పోలీసులకు అప్పగించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : molestation  rape  sexual assault  local train  moving train  Dadar Railway Station  mumbai  maharastra  crime  

Other Articles