Another Dalit BJP MP writes to PM Modi ప్రధాని గొప్పలకు బిత్తరపోయిన బీజేపి ఎంపీ..

Govt did nothing for community another dalit bjp mp from up writes to modi

Yashwant Singh, Nagina MP, Chote Lal Kharwar, Robertsganj MP, Dalits, BJP MPs, PM Narendra Modi, Yogi Adityanath, Uttar Pradesh

A Dalit BJP MP from Uttar Pradesh's Nagina, Yashwant Singh, wrote a letter to Prime Minister Narendra Modi and accused the Central government of ignoring the Dalits of the country.

ప్రధాని గొప్పలకు బిత్తరపోయిన బీజేపి ఎంపీ.. మోడీకి షాక్

Posted: 04/07/2018 04:26 PM IST
Govt did nothing for community another dalit bjp mp from up writes to modi

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు తాము ఇచ్చినంత గౌరవం.. దళితుల అభ్యున్నతికి తాను చేసినంత.. గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదని ప్రధాని నరేంద్ర మోదీ గొప్పలు చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వాటిని బీజేపి పాలిత రాష్ట్రాల్లో అంబేద్కర్ విగ్రహాలను ధ్ంసం చేసిన ఫోటోలను పెట్టి ఇలానే గౌరవిస్తున్నారా.. అంటూ ప్రశ్నించారు.

ఈ విషయాన్ని పక్కనబెడితే పార్లమెంట్‌ హౌస్‌ లో ఎంపీల వసతి కోసం నిర్మిస్తున్న వెస్ట్రన్‌ కోర్ట్‌ ఎన్నెక్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై సొంతపార్టీకి చెందిన బీజేపి ఎంపీలు కూడా బిత్తరపోతున్నారు. ఇప్పటికే బీజేపీకి చెందిన ఓ గిరిజన ఎంపీ చోటే లాల్ ఖర్వార్ ప్రధానికి లేఖ రాశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తనను అవమానించారంటూ లేఖలో పేర్కొన్నారు. సీఎంకు దళితులపై ప్రేమ లేదని, ఇక పార్టీలోనూ అదే సాగుతుందని అవేదనను వెల్లగక్కారు.

ఇక తాజాగా సొంత పార్టీకే చెందిన దళిత ఎంపీ యశ్వంత్ సింగ్ ప్రధాని మోడీకి షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లోని నగినా నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న యశ్వంత్ సింగ్.. బీజేపీ ప్రభుత్వం గత నాలుగేళ్ల పాలనలో దళితులకు ఏమీ చేయలేదని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. దళితుల పట్ల తమ పార్టీ నిర్లక్ష్య ధోరణిని అవలంభించిందని విమర్శించారు. దళితుడినైన తాను తన సామర్థ్యాన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేక పోతున్నానని... కేవలం రిజర్వేషన్ల వల్లే తాను ఎంపీని కాగలిగానని చెప్పారు.

దేశంలో ఉన్న 30 కోట్ల మంది దళితులకు ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని లేఖలో కోరారు. కేంద్రం రివ్యూ పిటీషన్ ను విచారణకు తీసుకోని పక్షంలో ఏకంగా రాజ్యంగాబద్దంగా చట్టంలో ఇందుకు అనుగూణంగా మార్పులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles