Low intensity earthquake jolts Jammu and Kashmir జమ్మూ, పంజాబ్ లలో ప్రకంపనలు.. ఉత్తరాఖండ్ లోనూ..

Low intensity earthquake jolts jammu and kashmir epicentre in punjab

Jammu and Kashmir, Jnk, earthquake, quake, landslide, kashmir, srinagar, amritsar, uttarakhand, high intensity quake

A low-intensity earthquake jolted Jammu and Kashmir although there were no reports of casualties or any damage. A state disaster management department official said: “An earthquake measuring 4.0 on the Richter scale occurred at 6.06 a.m.

జమ్మూ, పంజాబ్ లలో ప్రకంపనలు.. ఉత్తరాఖండ్ లోనూ..

Posted: 04/09/2018 10:35 AM IST
Low intensity earthquake jolts jammu and kashmir epicentre in punjab

జమ్మూకాశ్మీర్‌, పంజాబ్ రాష్ట్రాలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. అయితే తక్కువ స్థాయిలో ప్రకంపనలు సంభవించడంతో ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు వాటిల్లలేదు. రిక్టర్ స్కేల్ పై ఈ ప్రకంపనల తీవ్రత 4.0గా నమోదైందని విపత్తు నిర్వహణా శాఖ ప్రకటించింది. ఉదయం 6.06కు ఈ భూకంపం రావడంతో.. ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాసింత సమయం ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లోకి నెట్టివేయబడి తేరుకుని భూ ప్రకంపనలని తెలుసుకున్న ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.

కాగా తెల్లవారు జామున ఆరు గంటల సమయంలో భూమి ప్రకంపించడంతో.. చాలా మంది ఇంకా నిద్రావస్థలోనే వున్నారు. అసలు ఏం జరిగిందో కూడా తెలియని వీరు ఇతరుల నుంచి సమాచారం తెలుసుకున్న తరువాత అందోళనకు గురయ్యారు. అయితే భూకంప కేంద్రం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ సమీపంలో ఉందని విపత్తు నిర్వహాణా శాఖ అధికారులు తెలిపారు. భూకంపంపై మరింత సమాచారం తెలియాల్సి వుంది. కాగా, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలు భూకంపం జోన్-5లో ఉన్న సంగతి తెలిసిందే.  

ఉత్తరాఖండ్ లో త్వరలో పెనుభూకంపం

ఇదిలావుండగానే హిమాలయ సునామీలతో అతలాకుతలమైన ఉత్తరా ఖండ్ ను మరో ప్రకృతి ప్రళయం కబళించేందుకు సిద్దమైంది. ఉత్తరాఖండ్‌ లో త్వరలోనే అత్యంత భారీ భూకంపం విధ్వంసం సృష్టించనుందని ఆ రాష్ట్ర విపత్తు ఉపశమనం, నిర్వహణా కేంద్రం చీఫ్‌ పీయూష్‌ రౌతేలా తెలిపారు. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 8 కిపైగానే నమోదవ్వొచ్చని చెప్పారు. 2015, జనవరి 1 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో 51 సార్లు భూమి స్వల్పంగా కంపించిందనీ, వీటిని హెచ్చరికలుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఉత్తరాఖండ్‌ లో గత 200 ఏళ్లుగా ఒక్క భారీ భూకంపం కూడా రాలేదన్నారు.

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలు అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించే జోన్‌–5లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 1803లో చివరిసారిగా సంభవించిన భారీ భూకంపంతో ఉత్తరాఖండ్‌ అతలాకుతలం అయ్యిందన్నారు. రిక్టర్‌ స్కేలుపై 7 తీవ్రతతో భూకంపం వస్తే ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలైన ముస్సోరీలో 18 శాతం, నైనిటాల్‌లో 14 శాతం భవనాలు నేలమట్టమవుతాయని స్పష్టం చేశారు. ఇక్కడి భవనాల్లో చాలావరకూ 1951కి ముందే నిర్మితమమైనవే. దీంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని కూడా సూచించారు. సాధ్యమైనంత వరకు భూప్రకంపనలను ఎదుర్కోనే కట్టడాల్లోనే ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu and Kashmir  Jnk  earthquake  quake  landslide  kashmir  srinagar  amritsar  uttarakhand  high intensity quake  

Other Articles