కర్ణాటకలో కాంగ్రెస్ బలం రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవలే ప్రీ ఫోల్ సర్వేలు నిర్వహించిన సంస్థలు పదింట ఏడుగురు కర్ణాటక ముఖ్యమంత్రిగా మరోమారు సిద్దరామయ్యనే కావాలని కోరుకుంటున్న క్రమంలో.. కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు కూడా పెరుగుతుంది. దీంతో అత్యంత తక్కువ సందర్భాలలో ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించే కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటకలో మాత్రం తన రూటు మార్చింది. బెంగళూరులో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో ఈ సారి అధికారంలోకి వస్తే మళ్లి సిద్దరామయ్యనే తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించారు.
దేశవ్యాప్తంగా నరేంద్రమోడీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయని, గత ఎన్నికలు ముందు వినిపించిన నమో మంత్రి దేశంలో ఎక్కడా వినిపించడం లేదని కూడా అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో మోడీ తన సొంత లోక్ సభ నియోజకవర్గం నుంచి కూడా గెలుపోందలేని స్థితిలోకి వెళ్తారని, అక్కడ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్సీ పార్టీలు ఒక్కటై పోటీ చేస్తాయని కూడా చెప్పారు. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులున్నా.. త్వరలోనే అన్నీ పరిష్కారమవుతాయని రాహుల్ చెప్పారు. 2019 ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకీ పూర్వవైభవం తిరిగి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక ఇటు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపు నల్లేరుపై నడక మాదిరిగానే సాగుతుంది. ఇప్పటికే సర్వేసంస్థలు వెల్లడించిన వివరాల్లో కాంగ్రెస్ బలంగా వుండగా, మరింతగా బలోపేతం అయ్యింది. అందుకు వీరశైవ లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంతో.. లింగాయత్‌లు కూడా తమ మద్దతును రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రకటించారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలంటూ లింగాయత్ ఫోరం తమ సామాజిక వర్గానికి పిలుపునిచ్చింది.
తమకు మద్దతుగా నిలుస్తున్న వారికి తాము కూడా మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు చిత్రదుర్గ మురుగ మఠానికి చెందిన మఠాధిపతి శివమూర్తి మురుగ రాజేంద్రస్వామి తెలిపారు. తమ ఫోరం సభ్యులతో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఇక లింగాయత్‌లు అందరూ కాంగ్రెస్‌కు, ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు బసవ ధర్మ పీఠానికి చెందిన మాథే మహాదేవి కూడా పేర్కొన్నారు. దాదాపు రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న లింగాయత్‌లు ప్రకటించడంతో ఇక కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ఎన్నికలలో తిరుగేలేకుండా పోతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more