Algerian military plane 'carrying 200 soldiers' crashes అల్జిరీయాలో కుప్పకూలిన సైనిక విమానం.. 181 మంది మృతి

Algerian military plane carrying 200 soldiers crashes

military plane. Algerian website, smoke billow, Algerian military plane, army airport, Al-Hadath broadcaster, Boufarik Airport, Algerian Air Force, Algerian Defense Ministry

Many people are feared dead after an army plane crashed shortly after take off in Algeria. The military plane, a Ilyushin Il-78, was carrying dozens of military troops, and had taken off from the Boufarik base. Boufarik is located in northern Algeria, near the Mediterranean sea, some 30 kilometres from the capital, Algiers

అల్జిరీయాలో కుప్పకూలిన సైనిక విమానం.. 181 మంది మృతి

Posted: 04/11/2018 02:53 PM IST
Algerian military plane carrying 200 soldiers crashes

అల్జీరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అల్జీరియా ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం.. ఢిపెన్స్ కు చెందిన ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ చేసిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో 181 మంది అ ధేశానికి చెందిన సైనికులు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదం అల్జీరియా రాజధాని అల్జీర్స్ కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బౌఫారిక్ ఎయిర్ పోర్టు వద్ద ఇవాళ సంభవించింది. విమానంలో 200 మందికి పైగా మిటలరీ సిబ్బంది ఉన్నారు. వీరిలో 26 మంది వెస్టర్న్ సహారాకు చెందిన వారని తెలుస్తోంది.

ప్రమాదం సంభవించిన సమయంలో విమానంలో కనీసం 200 మంది ఉన్నారని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. 14 అంబులెన్స్ లు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించాయి. సహాయక చర్యలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు... ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల ఉన్న అన్ని రోడ్లను మూసేశారు. ఈ ఎయిర్ పోర్టును మిలటరీ ఎయిర్ బేస్ గా వినియోగిస్తున్నారు. అల్జీరియా పశ్చిమ ప్రాంతంలో ఉండే బిచార్ నగరానికి సైనిక సిబ్బందిని తరలిస్తుండగా ఈ ఘోరప్రమాదం జరిగింది. స్థానిక టీవీ ఫుటేజీలో పెద్ద ఎత్తున నల్లటి పొగ కనిపిస్తోంది. విమానం క్రాష్ అయిన ప్రదేశంలో పెద్ద ఎత్తున సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. పక్కనే ఉన్న ఆలివ్ చెట్ల మీద విమానం తోక భాగం కనిపిస్తోంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles