తెలుగు ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ పెరిగిపోయిందని.. తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వకుండా , వాడుకుని వదిలేస్తున్నారని గత నెల రోజులుగా పోరాటం చేయడంతో పాటు పలు లీకులను విడుదల చేస్తూ కొందిరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నటి శ్రీ రెడ్డి.. అంశం ఇక ఒక కొలిక్కి వచ్చింది. శ్రీరెడ్డి ఇష్యూపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనించి.. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలను పరిగణలోకి తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో వెంటనే స్పందించాలంటూ పలువురికి నోటీసులు కూడా జారీ చేసింది.
సినిమాల్లో అవకాశం ఇస్తానంటూ ఓ నిర్మాత కుమారుడు (అభిరామ్) లైంగికంగా వేధించటాన్ని జాతీయ మానవహక్కుల కమీషన్ సీరియస్ గా తీసుకుంది. ఈ అంశంపై స్వతహాగా స్పందించిన మానవహక్కుల కమీషన్.. ఈ పూర్తి వ్యవహారంపై తమకు వెంటనే సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర సమాచార, ప్రసార శాఖకు నోటీసులు ఇచ్చింది. దీనిపై నాలుగు వారాల్లోగా బుదులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, సమాచార, ప్రసార శాఖ సెక్రటరీలను ఆదేశించింది.
శ్రీరెడ్డి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా.. అమెతో నటిస్తే.. వారిపై నిషేధం విధిస్తామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) హెచ్చరికలు జారీ చేయడంపై తీవ్రంగా స్పందించింది. పనిచేసేచోట లైంగిక వేధింపుల్ని నిరోధించేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని ఎందుకు అమలు చేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రశ్నించింది NHRC. లైంగిక వేధింపులు ఎదురైన పక్షంలో ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎటువంటి చర్య తీసుకున్నారు అన్న అంశాలపై సరైన యంత్రాంగం లేకపోవడాన్ని ఎన్.హెచ్.ఆర్.సి తప్పుబట్టింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more