ఉమ్మడి రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. తొమ్మిది మందిని బలితీసుకుని.. 58 మందిని గాయాలపాలు చేసి వారి జీవితాల్లో అతి భయానక ఘటనగా మారేలా చేసిన ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురు నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులను కోర్టు కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేస్తుందన్న భావనలో ఉన్న బాధితులకు చివరకు నిరాశే మిగిలింది. పదకొండేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఇవాళ తీర్పును వెలువరించింది.
నిందితులపై నేరారోపణలు నిరూపించడంలో ప్రాషిక్యూషన్ విఫలమైందని చెబుతూ నాంపల్లిలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఈ కేసును కొట్టేసింది. నిందితులుగా ఉన్న దేవేందర్ గుప్తా, లోకేశ్ శర్మ, స్వామి అసీమానంద, భరత్ భాయి, రాజేందర్ చౌదరిపై అభియోగాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. విచారణ ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే ఐదుగురు నిందితులనూ నిర్ధోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపై ఎన్ఐఏ.. హైక్టోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
2007 మే 18న మధ్యాహ్నం 1.15 గంటలకు సరిగ్గా మధ్యాహ్నం నమాజ్ చేసుకునే సమయంలో చార్మినార్ సమీపంలోని 17వ శతాబ్దానికి చెందిన చారిత్రాత్మక మక్కామసీదు ఆవరణలోగల వజూఖానా వద్ద ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) బాంబు పేలడంతో తొమ్మిది మంది మరణించగా.. 58 మంది గాయపడ్డారు. అక్కడికి సమీపంలోనే పేలని మరో ఐఈడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు సంభవించిన అనంతరం జరిగిన అల్లర్లను అణిచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో 9 మంది మృతిచెందారు.
తొలుత హుస్సేనీఆలం పోలిస్ స్టేషన్లో కేసులు నమోదయినా.. ఉగ్రవాద దుశ్చర్య కావడంతో భారత హోంమంత్రిత్వ శాఖ కేసు దర్యాప్తు బాధ్యతను 2011 ఏప్రిల్ 4న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి అప్పగించింది. అప్పట్లో రెండు కేసుల్ని తిరిగి నమోదు చేసిన ఎన్ఐఏ మొత్తం పదిమంది నిందితుల్ని గుర్తించింది. సీబీఐ ఒకటి, ఎన్ఐఏ రెండు అభియోగపత్రాల్ని న్యాయస్థానంలో నమోదు చేశాయి. 2014 ఫిబ్రవరి 13న నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఎన్ఐఏ.. 10 మందిని నిందితులుగా చేర్చగా, వారిలో ఒకరు మృతి చెందారు. కాగా నలుగురిపై విచారణ కొనసాగుతోంది. మిగతా ఐదుగురిపై సాక్ష్యాధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటిచింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more