హైదరాబాద్ నగరంలో బ్యూటీషియన్ గా విధులు నిర్వహిస్తున్న యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఘటన వికారాబాద్ పరిధిలో నమోదైంది. హైదరాబాద్ నగరంలోని లింగంపల్లిలో గ్రీన్ ట్రెండ్స్‌లో బ్యూటీషియన్ గా పనిచేస్తున్న జ్యోతి అనే యువతి అమ్మమ్మ ఇంటికని బయలుదేరి మార్గమధ్యంలో శవమై కనిపించడం కలకలం రేపుతుంది. యాలాల్ మండలం పగిడాల్ గ్రామానికి చెందిన జ్యోతి.. కొన్నేళ్ల క్రితం తల్లి కాశమ్మ, తండ్రి మల్లికార్జున్ లతో కలిసి తాండూర్ లో నివాసం ఉంటుంది. తాండూరులోని అమ్మ వాళ్లింటికి జాతరకని ఇంట్లో చెప్పి బయలుదేరిని అమ్మాయి.. రైల్వే స్టేషన్ కు చేరుకుని బీజాపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో ఎక్కింది.
అయితే నిన్న రాత్రి రైలు ఎక్కిన అమ్మాయి ఇంకా ఇంటికి చేరలేదని కుటుంబసభ్యులు అందోళన చెంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో జ్యోటి దారుర్ మండలం తరిగోపుల రైల్వే స్టేషన్ లో రైలు నుంచి కిందపడిపోయిందన్న సమాచారం కుటుంబసభ్యులకు అందింది. బాధితురాలు ఇవాళ ఉదయం వరకు చావుతో పోరాటం చేస్తూనే వుంది. స్థానికులు సమాచారంతో యువతిని గుర్తించిన రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, తీవ్ర రక్తస్రావంతో అమె మృతి చెందింది.
రైలులో ప్రయాణం చేయాల్సిన యువతి ధారూర్ తరిగోపుల వద్ద అనుమానాస్పందా మరణించడం వెనుక పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. బీజాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు రాత్రి సమయంలో హైదరాబాద్ నుండి బీజాపూర్ చేరుకుంటుంది. అయితే ఈ రైలులో అధిక శాతం మంది ప్రయాణికులు శంకర్ పల్లి, వికారాబాద్ రైల్వే స్టేషన్లలోనే దిగిపోతారు. ఇక అక్కడి నుంచి రైలులో చాలా తక్కువ సంఖ్యలోనే ప్రయాణికులు వుంటారు. ఇక ఆ తరువాత వచ్చే ప్రధాన రైల్వే స్టేషన్ తాండూరే.
ఈ క్రమంలో ఒంటరిగా వున్న జ్యోతిని చూసి పైశాచిక మృగాళ్లు అఘాయిత్యానికి ప్రయత్నించే క్రమంలో వారి నురచి తప్పించుకునేందుకు అమె రైలు నుంచి దూకి గాయాలపాలైందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. యువతి ఫోన్ మైలారం ప్రాంతంలో లభ్యం కావడం కూడా ఈ అనుమానాలను బలపరుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్యా.? ఆత్మహత్యా.? ప్రమాదవశాత్తు పడిపోయిందా.? లేక అఘాయిత్యం లాంటి చర్యలను తప్పించుకోవడంలో ఇలా జరిగిందా.? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more