Mecca Masjid blast case accused acquitted మక్కామసీదు కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి రాజీనామా..!

Judge ravinder reddy resigns after delivering makkah masjid verdict

mecca masjid blast, mecca masjid blast verdict, NIA Court, Judge Ravinder Reddy, NIA court judge Resign, justice ravider reddy resign, mecca masjid blast verdict, mecca masjid verdict, mecca masjid judgment, swami aseemanand, nia, Mecca Masjid, CBI, aseemamand, 2007 masjid blast, hyderabad

NIA Court Judge Ravinder Reddy Resigned after Delivering Makkah Masjid Verdict followed by rumours that he recieved threat calls insisting him to resign, orelse threat to him and his family.

మక్కామసీదు కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి రాజీనామా..!

Posted: 04/16/2018 07:03 PM IST
Judge ravinder reddy resigns after delivering makkah masjid verdict

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులపై సరైన అధారాలను చూపలేదని పేర్కోంటూ వారందరినీ నిర్దోషులని తీర్పు చెప్పిన నాంపల్లి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ రవిందర్ రెడ్డి.. తీర్పును వెలువరించిన కొద్దిసేపటికే తన న్యాయమూర్తి పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారుతుంది. తీర్పు వెలువరించిన వెంటనే హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. తన రాజీనామా ఆమోదించేవరకు తనకు సెలవు ఇవ్వాలని కోరుతూ ఆ లేఖలో పేర్కొన్నారు.

వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నానని చెబుతున్నప్పటికీ... గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలియవచ్చింది. మక్కా మసీదు పేలుళ్ల కేసుకు సంబంధించి ఏమైనా ఒత్తిడిలు ఎదుర్కొంటున్నారా? ఇంకేమైనా ఒత్తిడులు ఉన్నాయా? తీర్పు ఇచ్చిన కొద్దిసేపటికే ఆయన రాజీనామా చేయడం తీవ్ర సంచలనం కలిగిస్తుంది. తన రాజీనామాకు సంబంధించి ఇప్పుడేమీ మాట్లాడలేనని, రాజీనామా ఆమోదం పొందిన తర్వాత తాను చెప్పదలచుకున్న విషయాలను మీడియా సమావేశంలో మాట్లాడతానని రవీందర్ రెడ్డి చెప్పారు.

కాగా, కొద్ది రోజులుగా తెలంగాణలో పలువురు న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముగ్గురు జడ్జిలను ఏసీబీ అధికారులు అరెస్టులుచేసి కేసులు నమోదు చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయయూర్తుల లిస్టులో రవీందర్ రెడ్డి కూడా ఉన్నారా? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే రవిందర్ రెడ్డి మక్కా మసీదు కేసు తీర్పులో ఒత్తిళ్లను ఎదుర్కోన్నారని, అందుచేతే పదవికి రాజీనామా చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఇవాళ్టి తీర్పు తర్వాత బెదిరింపులు వచ్చినట్లు రవీందర్ రెడ్డి  ఆయన మిత్రులతో చెప్పారని సమాచారం. వాస్తవానికి మరో రెండు నెలల్లో రవీందర్ రెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉండగానే అంత తందరపడి రాజీనామా ఎందుకు చేశారన్నది మాత్రం న్యాయమూర్తి మౌనం విధిల్చినప్పుడే తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles