మహాభారత కాలం నాటికే ఇంటర్నెట్, ఉపగ్రహ వ్యవస్థ మనకు అందుబాటులో ఉందంటూ త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై నెట్ జనులు ఓ వైపు జోక్స్ పేలుతుండగా, ముఖ్యమంత్రి చెప్పిన విషయాల్లో నిజాలున్నాయని త్రిపుర గవర్నర్ తాతగతా రావు సమర్థించారు. ఓ వైపు ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాలు వేదికగా నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. త్రిపుర రాజధాని అగర్తాలాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను గవర్నర్ కూడా సమర్థించారు.
మహాభారత సంగ్రామంలో ఎప్పటికప్పుడు ఏంజరుగుతుందో సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేశాడని, అది ఇంటర్నెట్ వల్లే సాధ్యమైందని, ఈ టెక్నాలజీ అప్పట్లోనే అందుబాటులో ఉందనే విషయం మనకు తెలియలేదని అన్నారు. ఇంటర్నెట్ ను పాశ్చాత్యదేశాలు కనుగొన్నాయని భావించే ప్రతిఒక్కరూ లక్షల సంవత్సరాల క్రితమే ఈ టెక్నాలజీని భారత్ వినియోగించిందనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఇటువంటి దేశంలో జన్మించడం తనకు గర్వకారణంగా ఉందని, ఇంటర్నెట్ వంటి అద్భుత సాంకేతికతను దేశ ప్రజలకు మోదీ అందుబాటులోకి తెస్తున్నారని అన్నారు.
కాగా, ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు పలు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ‘తెలివి తక్కువ వ్యాఖ్యలు’, ‘మరి, ఆ కాలంలో ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు ఎలా వెనక్కి రావాలో అడగలేదు ఎందుకుని?’ అంటూ ప్రశ్నించారు. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను గవర్నర్ సమర్థించారు. పురాణాల్లో వున్న పుష్పక విమానం, పుష్ఫక రథం సహా పలువురు మహాపురుషులకు దివ్వదృష్టి కూడా వుండేదని అన్నారు. అయితే ఇంటర్నెట్, శాటిలైట్ అన్నవి వున్నాయని కాదు.. అంతకంటే దేదీప్యమైన సాంకేతికత వుండేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారని ఆయన మద్దతు పలికారు.
Tripura Chief Minister’s observations about the happenings of the Puranic period are topical. It is virtually impossible to conceive of devices like ‘Divya drishti’,Pushpaka Ratha’,etc without some kind of prototype and study thereon
— Tathagata Roy (@tathagata2) April 18, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more