Laxmi narayana meets farmers in yagili రైతులతో జేడీ లక్ష్మీనారాయణ బేటీ.. రాజకీయ పార్టీలలో ఉత్కంఠ

Laxmi narayana creates curiosity in political parties meets farmers

Union Government, voluntary retirement, J D Lakshmi Narayana, Guntur, IPS officer, Maharastra ADGP

JD Laxmi Narayana meets farmers in guntur yagili and gets their problems to notice after his voluntary retirement is approved by the union government

రైతులతో జేడీ లక్ష్మీనారాయణ బేటీ.. రాజకీయ పార్టీలలో ఉత్కంఠ

Posted: 04/26/2018 08:00 PM IST
Laxmi narayana creates curiosity in political parties meets farmers

రాజీనామా ఆమోదం పొందాక సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రజల్లోకి వచ్చారు. గుంటూరు జిల్లా యాజిలిలో రైతులతో సమావేశమయ్యారు. రాజకీయాల్లోకి వస్తారని భావిస్తున్న తరుణంలో యాజిలి రైతులతో లక్ష్మీనారాయణ భేటీ కావడం ప్రధాన్యత సంతరించుకుంది. రాజీనామా ఆమోదం తర్వాత తొలి సమావేశంలో లక్ష్మీనారాయణ ఎలాంటి ప్రకటన చేస్తారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే మహారాష్ట్ర అదనపు డీజీపీ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ దరఖాస్తును ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించిన విషయం తెలిసిందే. 1990 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డిప్యూటేషన్‌పై సీబీఐ జేడీగా పనిచేశారు.
 
ఆయన త్వరలో రాజకీయాల్లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారన్నది మాత్రం క్లారిటీ లేదు. ఆయన సొంత పార్టీ పెట్టబోతున్నారన్న మరో ప్రచారం కూడా సాగుతోంది. లక్ష్మీనారాయణ బీజేపీలోకి వెళతారని ఒకవైపు.. జనసేనలోకి వెళ్తారని మరోవైపు, ఆయన పవన్‌‌కు టచ్‌లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
 
ఇప్పటీకే లక్ష్మీనారాయణ జనసేనలోకి వస్తే ఆహ్వానిస్తామని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. ఆయనకు రాజకీయ, పరిపాలన విధానాలపై మంచి పట్టుందని పవన్ తెలిపారు. అయితే ఇప్పటివరకు లక్ష్మీనారాయణతో ఎలాంటి చర్చలు జరపలేదని, ఒక్కసారి మాత్రమే ఆయనను కలిశానని, ఆ తర్వాత ఆయనతో మాట్లాడడం కానీ, కలవటం కానీ జరగలేదన్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన గుంటూరు జిల్లాలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన తన రాజకీయ ప్రస్తానంపై ఎలాంటి ప్రకటన చేస్తారో అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles