కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గోని రాష్ట్రం మొత్తం చుట్టి పరిస్థితును తమకు అనుకూలంగా మార్చుకున్న బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన ప్రచార ఘట్టాన్ని క్రితం రోజుతో ముగించగా, ఇక నేటి నుంచి వరుసగా వారం రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ బాధ్యతలను తన భుజాలపైకి ఎత్తుకోనున్నారు. ఎనిమిదో తేదీ వరకూ పలు సభలు, రోడ్‌షోలలో మోదీ పాల్గొంటారు. ఇందుకోసం ఇప్పటికే కర్ణాటకకు చేరకున్న ప్రధాని మోడీ.. ఇవాళ ఉదయం 11 గంటలకు చామరాజనగర పట్టణంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తారు.
ప్రధాని నరేంద్రమోడీ ప్రచారపర్వం గురించి దేశప్రజలకు తెలుసు. ఇక ఆయన ప్రసంగాలు తటస్థ ఓటర్లను తమవైపుకు తిప్పుకునేలా వుంటాయన్న విషయం కూడా బాగా అర్థం చేసుకున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. ప్రధానికి మనస్పూర్తిగా స్వాగతం పలుకుతూనే షాకిచ్చారు. ప్రధాని నిత్యం వల్లే వేసే అవినీతి విషయంలోనే ఆయనను టార్గెట్ చేస్తూ పలు విమర్శనాత్మక ట్వీట్లు పోస్టు చేసి.. తన ప్రశ్నలకు బదులివ్వాలని హ్యాస్ ట్యాగ్ తో #అన్సర్ మాది మోదీ అంటూ (#AnswerMaadiModi) కోరారు.
ఆయన ట్వీట్ల సారాంశం.. డియర్ నరేంద్రమోడీ, మా కర్ణాటకకు మీరు వస్తున్నారని తెలుసుకున్నాం. మీకు మా రాష్ట్రం తరపున ఘనస్వాగతం. మీకు ఇక్కడి రానున్న తరుణంలో మీకు కన్నడీగుల తరపున వున్న కొన్ని అంధోలన కలిగిస్తున్న ప్రశ్నలను అడగదలుచుకున్నాం.. వాటిని నివృత్తి చేస్తారని అశిస్తున్నాం.. మీ బహిరంగ సభల్లో గాలి జనార్థన్ రెడ్డి పాలుపంచుకుంటున్నారా.? గాలి జనార్థన్ రెడ్డి కుటుంభ సభ్యులకు, అతని మిత్రులకు మీరు 8 స్థానాల్లో పార్టీ టిక్కెట్లను కేటాయించారా..? అది మీ పార్టీకి పది నుంచి 15 స్థానాల్లో మేలు చేస్తుందని అశిస్తున్నారా.? అని ప్రశ్నించారు. ఇక ఇదేనా మీ అవినీతిపై ప్రసంగాల సారాంశమని నిలదీసారు. ఈ తరహా జిమ్మిక్కులను కన్నడీగులు నమ్మరని ఘాటు వ్యాఖ్యలు పేర్కోన్నారు.
ఇక బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కుంభకోణాల్లో చిక్కుకున్న వ్యక్తి బిఎస్ యడ్యూరప్పను ప్రకటించడం సమంజసమేనా.? అని ప్రశ్నించిన సిద్దూ.. ఇక పత్రికలలో వస్తున్న వార్తలలో మాత్రం మీరు ఆయనతో కలసి డయాస్ పంచుకోరని, ఆయనతో కలసి ఏ ర్యాలీలలో పాల్గొనబోరని తెలుస్తుంది. ఇది నిజమేనా..? అయితే ఆయన.. మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థేనా కాదా.? దీనిపై స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా వుందని ఆయన తన ట్వీట్ల ద్వారా ప్రశ్నించారు.
ఇక కర్ణాటక రాష్ట్రంలో అత్యాచార కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తికి మీ పార్టీ టికెట్ ఎలా ఇచ్చింది.? అసెంబ్లీలో అశ్లీల వీడియో చూసిన ఎమ్మెల్యేకు కూడా మరోమారు టిక్కెట్ ఇచ్చింది.? ఇది మీకు సమంజసమేనా.? అంటూ ప్రశ్నించారు. ఇక ఉత్తర్ ప్రదేశ్ లో అత్యాచారం కేసులో చిక్కుకున్న ఎమ్మెల్యేను సీఎం ఆదిత్యనాథ్ రక్షణగా నిలుస్తారు..? జమ్మూకాశ్మీర్ లో అత్యాచార నిందితుల్ని మీ ఎమ్మెల్యే వెనకేసుకోస్తారు..? మీరు మాత్రం కర్ణాటకలో జరిగిన అత్యాచారంపై అదిరిపోయే విధంగా ప్రచారం చేస్తారా.? ఇదేనా మీ బేటీ బచావ్ నినాద స్పూర్తి అంటూ సిద్దరామయ్య ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇక మరోవైపు కర్ణాటకలోని ఉత్తర, ధక్షిణ ప్రాంతాలతో పాటు కోస్టల్ కర్ణాటక ప్రాంతంలోనూ ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ ప్రచారం చేయనున్నారు. కోస్టల్ కర్ణాటకలోని ప్రచారం చేయడంతో పాటు అక్కడున్న మఠాన్ని కూడా ప్రధాని సందర్శించనున్నారు. ఇదివరకే సిద్దరామయ్య ప్రభుత్వాన్ని పది పర్సెంట్ ప్రభుత్వమని ప్రధాని విమర్శనాస్త్రాలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ సాయంత్రం బెళగావి జిల్లా చిక్కోడిలో బెళగావి రెవెన్యూ విభాగ కార్యకర్తల సమావేశాల్లో ఉపన్యసిస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more