Assembly Elections in Karnataka కర్ణాటకలో కమల వికాసం.. అయినా ఉత్కంఠత

Assembly elections in karnataka

Assembly elections in Karnataka, Karnataka news, Karnataka 2018 results, Karnataka Assembly elections, Karnataka updates, Karnataka new, Karnataka elections, Karnataka 2018 elections, Karnataka Assembly results, Congress, BJP, JDS

BJP almost won majority in Karnataka Assembly Elections

కర్ణాటకలో కమల వికాసం.. అయినా ఉత్కంఠత

Posted: 05/15/2018 05:54 PM IST
Assembly elections in karnataka

(Image source from: newsclick.in)

దక్షిణాది రాష్ట్రాల్లో అతి పెద్ద రాష్ట్రమైన కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు రాజకీయాల పరిశీలకులకు సైతం ఆశ్చర్యం కలిగించాయి. ముందు నుండి అందరూ ఊహించిన విధంగా సిద్ధారామయ్య వర్గానికి అనుకూలంగా కాకుండా ఫలితాలు రావడంతో అందరికీ షాక్ తగిలింది. పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్నిఏర్పాటు చేస్తారని అనుకున్నా... ఫలితాలు మాత్రం తలకిందులయ్యాయి. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం ఫలితాలు కమలనాధుల్లో ఉత్సాహాన్నినింపాయి. సిద్ధారామయ్య మంత్రి వర్గంలోని దాదాపు 16 మంది మంత్రులు ఎన్నికల్లో తమ ప్రాభల్యాన్ని చూపించలేదు అంటేనే పరిస్థితి ఎంత విచిత్రంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

కమలనాధులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో యడ్యూరప్ప వర్గానికి ముందు నుండి మంచి ఫలితాలు వచ్చాయి. సిద్ధారామయ్య ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత బయటికి కనిపించకపోవడం, బీజేపీ నుండి పోటీ చేసిన అభ్యర్థులు అవినీతి ఆరోపణలను ఎదుర్కోవడంలాంటివి ఎన్నికల ఫలితాలను మార్చేస్తాయి అని అందరూ అనుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

బెంగళూరు లాంటి ప్రాంతాల్లో బీజేపీకి ముందు నుండి అనుకూల ఫలితాలు రావడం, మైసూర్ పరిసర ప్రాంతాల్లో జేడీయూ క్లీయర్ గా మెజార్టీని ప్రదర్శించడంతో ఫలితాల్లో అనుకోని మార్పులు సంధవించాయి. కాగా కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో ఒంటిచేత్తో నడిపిస్తున్నారని భావించిన సిద్ధారామయ్య బాదామి, ఛాముండేశ్వరిలలో పోటీ చేసినా కేవలం బాదామిలో మాత్రమే గెలుపు సాధించడం విశేషం.

కింగ్ మేకర్ అవుతారని అనుకున్న జేడీయూ ఏకంగా కింగ్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడం.. కాంగ్రెస్, జేడీయూతో కలిసి ప్రభుత్వాన్నిఏర్పాటుచేసేందుకు అవకాశాలు ఉండటంతో జేడీయూలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. అయితే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నుండి రకరకాల ఆఫర్లు వస్తుండటంతో జేడీయూ నిర్ణయం ఎంతో కీలకం కానుంది. కాగా జేడీయూ కీలకనేత కుమారస్వామి గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతికోరడం.. ఈ సాయంత్రం దిల్లీ నుండి బీజేపీ నేతలు బెంగళూరుకు వస్తుండటంతో కర్ణాటక రాజకీయాలు ఎంతో కీలకంగా మారాయి.

 
 
 
 

 

 
 
 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka elections  BJP  Congress  JDS  

Other Articles