గోదావరి నదిలో పెళ్లి బృందంతో వెళ్తున్న లాంచీని ఎట్టకేలకు అధికారులు, పోలీసులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు.. పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య లాంచీ మునిగినట్లు సహాయక చర్యల్లో పాల్గోన్న రెస్కూ టీంలు గుర్తించాయి. అయితే... ఎన్టీఆర్ఎఫ్, పోలీస్ బృందాలు లాంచీని వెలికితీసే ప్రయత్నంలో ఉన్నాయి. భారీ క్రేన్ల సాయంతో లాంచీని ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సహయాకచర్యలు కొనసాగుతున్నాయి. అలాగే గోదావరిలో గల్లంతైన వారి కోసం అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.
భారీ వర్షానికి తోడు తీవ్రమైన గాలులు వీయడంతో అదుపుతప్పి లాంచీ.. గోదావరిలో మునిగిపోవడంతో విషాదం అలుముకుంది. ఇదిలా ఉండగా ప్రమాద సమయంలో మొత్తం లాంచీలో 38 మంది గిరిజనులు ఉన్నారని తెలుస్తుండగా అందులో ఏడుగురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు, కాగా ప్రతికూల వాతావరణం కారణంగా అంతరాయం ఏర్పడింది. హెలికాప్టర్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. అయితే లాంచి మాత్రం 40 అడుగుల లొతున వున్నట్లు అధికారులు గుర్తించారు.
తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. సమీప గ్రామమైన మంటూరు సమీపానికి చేరడమే చాలా కష్టంగా ఉంది. ఆ మార్గం ఏ మాత్రం సహకరించడం లేదు. ఎట్టకేలకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీ, రంపచోడవరం సబ్ కలెక్టర్, ఎమ్మెల్యేలు ప్రమాద ప్రాంత సమీప గిరిజన గ్రామానికి చేరుకున్నారు. వర్షం కూడా ఉండడంతో గాలింపు చర్యలు చేపట్టేందుకు వాతావరణం సహకరించడం లేదు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన అధికారులు ప్రమాద ప్రాంతాలకు అటు, ఇటూ చేరుకుని సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఘటనాస్థలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి చిన్నరాజప్పలు చేరుకోనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more