కర్ణాటకలో ఓటరు తీర్పుతో దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిన రాజకీయ పార్టీలు.. ఇప్పుడు అధికారం కోసం మాత్రం ఎత్తులు, పైఎత్తులు వేస్తూన్నారు. దీంతో కర్ణాటకలో రాజకీయాల్లో హైడ్రామాలకు వేదకగా మారుతున్నాయి. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒక్కటి అన్న ఓటరు తీర్పు నేపథ్యంలో అధికారం అందుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో రాజకీయాలు క్షణక్షణం మారిపోతోంది. 104 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపికి అధికారం దక్కనీయకుండా కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్ బీజేపికి మద్దతు తెలిపడంతో బీజేపి బలం 105కు చేరకుంది.
ఇందుకు అనుగూణంగా తాము అధికారంలోకి రాకపోయినా పర్వాలేదని భావిస్తున్న కాంగ్రెస్.. జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామినే సీఎంగా కొనసాగించేందుకు కూడా సిద్దమైంది. ఇలా కాంగ్రెస్-జేడీ(ఎస్) కూటమి ఏర్పడి 24గంటలు గడవకముందే కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆమ్నాబాద్ ఎమ్మెల్యే రాజశేఖర్ బి. పాటిల్, నగేంద్ర(కూడ్లగి), ఆనంద్ సింగ్(విజయ నగర)తో పాటు భీమా నాయక్, అమేర్ గౌడ నాయక్ లు అజ్ఞాతంలోకి జారుకున్నారని తెలుస్తుంది.
అయితే వారిని అన్వేషించే పనిలో భాగంగా అధిష్టానం చర్యలు చేపట్టింది. కాగా వీరు బీజేపితో టచ్ లో వున్నారని, వారి మద్దతు ధీమాతోనే బీజేపి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నధమైందని తెలుస్తుంది. ఈ క్రమంలో రేపు (గురువారం) ఉదయం 11.30 గంటలకు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేస్తారని బీజేపి ఎమ్మెల్యే శ్రీరాములు ప్రకటించడం.. రాజ్ భవన్ కు వెళ్లిన బీజేపి పక్ష నేత యడ్యూరప్ప కూడా గవర్నర్ ను కలిసిన తరువాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ అదే విషయాన్ని వ్యక్తపర్చారు.
అయితే ఎమ్మెల్యేలు కనిపించకుండా పోయారనే వార్తలను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖండించారు. ఎన్నికలలో గెలిచిన తమ ఎమ్మెల్యేలందరూ తమకు అందుబాటులో ఉన్నారని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేల ఆచూకీ తెలియడం లేదని ఎవరో గిట్టని వాళ్లు వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే విశ్వాసంతో ఉన్నాం. కాసేపట్లో అందదరితోనూ సమావేశం అవుతామని ఆయన చెప్పినా.. కాంగ్రెస్ పక్ష సమావేశానికి మాత్రం ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదని తెలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more