వాహనాలను నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడుతూ పోలీసుల కంటబడితే ఇంకేమైనా వుందా.. వారు వెంటనే ఫోటో తీయడం.. అందుకు గాను జరిమానా విధించడం.. అది నేరుగా ఇంటికి చేరడం అంతా చకచకా జరిగిపోతుంది. ఎందుకోచ్చిన చలానాలు అనుకునే వారు మాత్రం ఫోన్ ఎంత మోగినా దానిని వాహనాలను నడిపే సమయంలో మాత్రం తీయరు. ఇక మరికోందరు ముందుగానే వాటిని ఫ్లైట్ మోడ్ లేదా.. డ్రైవింగ్ మోడ్ లో పెట్టేస్తారు. తీరా పోలీసులకు చిక్కి.. జరిమానాలు ఎందుకు అనవసరంగా కట్టాలి అనుకునే వారు చేసే పనులు ఇవి.
ఇలా కాకుండా మరికోందరు మాత్రం ఏమౌవుతుందిలే అనుకునేవాళ్లు మాత్రం తమ ఫోన్ మోగిన వెంటనే దానిని తీసి ఎంచక్కా మాట్లాడేస్తారు. అయితే ఈ క్రమంలో వారు తమ తోటి వాహనదారులకు మాత్రం ఇబ్బందులు తెచ్చిపెడుతుంటారు. పలు సందర్భాలలో ప్రమాదాల బారిన పడటమే కాకుండా తోటి వాహనచోదకులను కూడా ప్రమాదాల బారిన పడేస్తుంటారు. అయితే ప్రమాదాల బారిన పడేయకుండా వాహనాలు నడుపుతూ ఫోన్ మాట్లాడటం తప్పేం కాదని తాజాగా న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం చట్టవిరుద్ధం కాదని పేర్కోంది.
ఔనా అంటూ విస్తుపోతున్నారా..? ఇది నిజంగా నిజం. ఈ మేరకు కేరళ హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. చట్టంలో దీనిపై ఎలాంటి నిబంధనలు లేనందున పోలీసులు కేసు నమోదు చేయజాలరని స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వారిని ప్రజా భద్రతకు ముప్పు కలిగిస్తున్న వారిగా పేర్కొంటూ... కేరళ పోలీసులు 118 సెక్షన్, 118 (ఇ) కింద కేసులు నమోదు చేస్తున్నారు. అయితే డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడేవారిని ప్రజా భద్రతకు ప్రమాదంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కేసు నమోదు చేయదల్చుకున్న పక్షంలో... ఆ మేరకు చట్టాన్ని సవరించి శాసన సభలో ఆమోదించాలని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more