all eyes on next karnataka speakers' election స్పీకర్ ఎంపికే యడ్డీ ప్రభుత్వానికి పెద్ద సవాల్..!

Election to karnataka speaker s post will be crucial for yeddyurappa

karnataka assembly, assembly speaker, speaker election, congress mlas, jds mlas, BS Yeddyurappa, governor, vajubhai wala, Congress, BJP, JDS, Kumara Swamy, hyderabad, kochi, Siddaramaiah, PM Modi, Amit shah, karnataka, politics

With the fight over government formation in Karnataka now in the Supreme Court, there is yet another battle on the floor of the House — the election to the chair of Assembly Speaker.

స్పీకర్ ఎంపికే యడ్డీ ప్రభుత్వానికి పెద్ద సవాల్..!

Posted: 05/18/2018 11:15 AM IST
Election to karnataka speaker s post will be crucial for yeddyurappa

కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పించిన గవర్నర్ వాజుభాయ్ వాలా.. యడ్యూరప్పతో ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ప్రమాణస్వీకారం చేయింది. పక్షం రోజుల వ్యవధిలో బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా అదేశించిన విషయం తెలిసింది. అయితే బలనిరూపణ జరగాలంటే ముందుగా కర్ణాటకలో అసెంబ్లీ స్పీకర్ ఎంపిక అత్యంత ప్రాధాన్యతను సంక్రమించుకుంది. అంతేకాదు కార్ణాటకలో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో స్పీకర్ ఎంపిక, ఆయన నిర్వహించే పాత్ర కూడా కీలకంగా మారనుంది.

అయితే కర్ణాటక అసెంబ్లీ ఇప్పటికే ప్రోటెం స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే దేశ్ పాండేను సిఫార్సు చేసింది. అయితే ప్రోటెం స్పీకర్ ఎమ్మెల్యేల చేత ప్రమాణం మాత్రమే చేయించగలరు కానీ.. ప్రభుత్వం బలనిరూపణ అంశంలో మాత్రం ఆయనకు ఎలాంటి విశేషాధికారలు వుండవు. అసలు అది ఆయనకు సంబంధించిన అంశమే కాదన్నది తెరపైకి వస్తున్న వాదన. అయితే గత్యంతరం లేని పరిస్థితుల నేపథ్యంలో ఆయన బలనిరూపణ నిర్వహించినా తప్పలేదన్న మరోవాదన కూడా తెరపైకి వస్తుంది. అలా కానీ పక్షంలో స్పీకర్ ఎన్నిక కీలకంగా మారనుంది.

ఇప్పుడు ఇదే అంశంపై కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అశలు పెట్టుకుంది. స్పీకర్ ఎన్నిక అంశంలోనే యడ్యూరప్ప ప్రభుత్వం మనుగడ సాధిస్తుందా..? లేదా అన్న అంశం తేలిపోతుందని, దీంతో ఇక బలనిరూపణ అంశం వరకు అగాల్సిన పనిలేదని భావిస్తుంది. యడ్యూరప్ప ప్రభుత్వానికి సాధారణ మెజారిటీ కన్నా 8 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉండటమే కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అశలకు బలాన్నిస్తుంది.  మైనారిటీలో వున్న బీజేపి ప్రభుత్వం స్పీకర్ ను ఎలా ఎన్నుకుంటుంది.? ఒకవేళ స్పీకర్ ను ఎన్నుకోలేకపోతే బీజేపి ప్రభుత్వ ఆట ముగిసినట్లేనని రాజకీయవర్గాల్లో కూడా ఈ అంశం తీవ్రచర్చకు దారితీస్తుంది. మరి యడ్యూరప్ప, కాషాయపార్టీ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : speaker election  congress mlas  jds mlas  BS Yeddyurappa  Congress  BJP  JDS  karnataka  politics  

Other Articles