ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అంతా కలసి ఐక్యంగా వున్నామన్న సంకేతాలను ప్రజల్లోకి పంపి మరోమారు వారితో పాటు వారి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన నేతలు.. తమలో తామకు వున్న విభేధాలను బహిర్గతం చేసుకుంటూ ప్రజలను అయోమయ పరిస్థితుల్లోకి నెట్టుతున్నారు. ఓ వైపు విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు, కు మంత్రి అయ్యన్నపాత్రుడికి మధ్య మరో వైపు కర్నూలులో మంత్రి అఖిలప్రియకు సబ్బారెడ్డికి మధ్య వివాదాలు రాజుకుని వాటిని ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే స్వయంగా పరిష్కరించాల్సి వచ్చిన క్రమంలో ఇటు కడపలో మంత్రి అదినారాయణ రెడ్డికి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు మధ్య కూడా వివాదాలు బహిర్గతం కావడం పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది.
అయితే సీఎం రమేష్ పై మంత్రి అదినారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అంతేకాదు తనదైన రాయలసీమ స్టైల్లో సంచనలమైన హెచ్చరికలు కూడా జారీ చేయడం ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తన నియోజకవర్గంలోని ప్రతి అభివృద్ధి పనికీ అడ్డొస్తున్నారని మంతి ఆరోపించారు. సీఎం రమేష్ కనిపిస్తే కాల్చివేసే రోజులొస్తాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి విషయానికీ అడ్డుపడుతూ, అనవసరమైన విమర్శలు చేస్తున్న ఆయనను చెప్పులతో కొట్టి తరిమే సమయం రానుందని అన్నారు. తాను తుపాకి వంటి వాడినని, తన కార్యకర్తలు బుల్లెట్ లను అందిస్తే, వాటిని కాల్చడమే తన పనని నిప్పులు చెరిగారు.
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన మినీ మహానాడులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మార్కెట్ యార్డులో కూపన్లు అమ్ముకున్నానని కొంతమంది నీచంగా ప్రచారం చేస్తున్నారని, రామసుబ్బారెడ్డిని, ఆయన వర్గీయులను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని చెప్పారు. సీఎం రమేష్ ఇక్కడ కాంట్రాక్టు పనులు చేసుకుంటున్నా, నాయకులు వందల కోట్ల విలువైన పనులు చేసుకుంటున్నా తాను అడ్డుపడలేదని చెప్పిన ఆదినారాయణరెడ్డి, తదుపరి ఎన్నికల్లో తాను జమ్మలమడుగు నుంచి కచ్చితంగా పోటీలో ఉంటానని, చంద్రబాబు తనకే టికెట్ ఇస్తారన్న నమ్మకం ఉందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more