janasena for environmental safeguard development: pawan kalyan పర్యావరణ హేతుకర అభివృద్దే జనసేన సిద్దాంతం: పవన్ కల్యాన్

Janasena for environmental safeguard development pawan kalyan

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, sompeta, pawan kalyan porata yatra, pawan kalyan sompeta meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan who is in srikakulam district visited sompeta region and asked the problems of locals. power star urged his fans to stand in favour of enviromental pro commitees.

పర్యావరణ హేతుకర అభివృద్దే జనసేన సిద్దాంతం: పవన్ కల్యాన్

Posted: 05/21/2018 07:59 PM IST
Janasena for environmental safeguard development pawan kalyan

జనసేన పార్టీ అవిర్భవించిన తరువాత మూడేళ్ల తరువాత పార్టీ సిద్దాంతాలను రూపోందించామని, వాటిలో పర్యావరణ పరిరక్షణ అనేది కూడా వుందని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. తమ పార్టీ పర్యావరణ హేతుకరమైన అభివృద్దికి తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. పర్యావరణానికి విఘాతం కల్పించి చేసే అభివృద్దికి తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. పర్యావరణం పాడైతే మనుషుల మనుగడతో పాటు సకల జీవరాశుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన అన్నారు.

శ్రీకాకులం జిల్లా సోంపేటలోని బీల భూములను పరిశీలించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడే అమరవీరుల స్థూపం వద్ద రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పోందిన అమరవీరులకు ఆయన శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు, ఇళ్లను ఇచ్చి ప్రభుత్వం అదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రకృతి అన్ని జీవరాశులకు ఇచ్చిన వరాన్ని మనిషి చెడగొట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

సొంపేట బీలభూములపై అక్కడి రైతులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ ఇచ్చిన సమగ్ర నివేదికను అందుకున్న పవన్ కల్యాణ్.. దానిని అవగతం చేసుకున్న తరువాత ఈ భూముల విషయమై స్పందిస్తానని చెప్పారు. ఈ ప్రాంతాంలో అనేక మంది మత్య్సకారులు, రైతులు జీవనం సాగిస్తున్నారని, వారిని కాదని రొయ్యల చెరువులను ఎందుకు తీసుకువస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రొయ్యల చెరువులు తొవ్వడం వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయని, అక్కడి రైతులు అందోళన చెందుతున్న క్రమంలో ఇక్కడ కూడా అదే విధానంతో ప్రభుత్వాలు చర్యలు చేపట్టడం సముచితం కాదన్నారు.

పశ్చిమ గోదావరిలో రోయ్యల చెరువులతో నీళ్లు కలుషితం అయ్యాయని, భూగర్బ జలాలపై కూడా రోయ్యల చెరువుల ప్రభావం తీవ్రంగా పడిందని పవన్ కల్యాణ్ అన్నారు. అక్కడ పర్యావరణం దెబ్బతినిందని అక్కడి రైతులు తనతో గొడును వెళ్లబోసుకున్నారని.. ఒక ప్రాంతంలో విఘాతం కలిగిందని తెలిసిన తరువాత కూడా మరో ప్రాంతంలో రొయ్యల చెరువులకు ప్రభుత్వం ఇష్టానుసారంగా అనుమతు ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇక ప్రభుత్వం నోట్ల కట్టలపై అశతో ఇచ్చే అనుమతులపై ఎదురుతిరిగే సామాన్యులపై చట్టాలను బలంగా వినియోగిస్తారని పవన్ దుయ్యబట్టారు. ఇకపై పర్యావరణ విఘాతం కలిగే ప్రభుత్వ విధానాలను, అభివృద్దికి పోరాడే వారికి తమ జనసైనికులు అండగా నిలుస్తారని పవన్ ధైర్యం చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles